తూర్పుగోదావరి

నేరుస్థులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 28: వివిధ కేసులో నేరస్థులుగా ఉన్న వారికి తప్పనిసరిగా కోర్టుల్లో శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు విజ్ఞప్తి చేశారు. కాకినాడ నగరంలోని పోలీసు అతిథి గృహంలో శనివారం జిల్లాకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ సమాజంలో నేరాలకు పాల్పడే వారికి తప్పనిసరిగా కోర్టుల్లో శిక్షపడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా సాక్షులను కోర్టులకు హాజరుపరిచే సమయాల్లో వారిపై ఎటువంటి వత్తిడి, ప్రలోభాలు, బెదింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా కోర్టులో ఛార్జిషీటు ఫైల్‌చేసే సమయంలో దానిలో ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కేసుల విషయంలో సమన్వయంతో పనిచేస్తే నేరస్థులకు కోర్టుల్లో శిక్షపడే అవకాశం ఉంటుందని చెప్పారు. సమావేశంలో ఎఎస్పీ ఎఆర్ దామోదర్, ఒఎస్‌డి వై రవిశంకరరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎం దుర్గాప్రసాద్, కాకినాడ మూడవ అదనపు జిల్లా కోర్టు పిపి ఎం విశే్వశ్వరరావు, సీనియర్ ఎపిపి ఎంవివిఎస్ ప్రకాష్‌రావు, పలువురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.
మరో 10 ఏకలవ్య పాఠశాలలు
గిరిజన సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి వాసు
రాజవొమ్మంగి, నవంబర్ 28: రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో మరో 10 ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గిరిజన సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్మి దేవర వాసు అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలికల కళాశాలను శనివారం రాత్రి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ వివిధ జిల్లాల్లో ఇప్పటికే 12 మినీ ఏకలవ్య పాఠశాలలు పనిచేస్తున్నాయని, కొత్తగా ఏర్పాటుచేసే పాఠశాలలకు స్థల సేకరణ చేస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మెత్తం 136 విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని, ఈ పాఠశాలలకు పూర్తిస్థాయిలో వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. నీరు, విద్యుత్, టాయిలెట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్యార్థులు బట్టీ పద్ధతిని కాకుండా సిసిఇ పద్ధతిలో మెరుగైన విద్యనందిస్తున్నామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పూర్తిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అనంతరం పాఠశాల అధ్యాపకులతో సమావేశం ఏర్పాటుచేసి నూరు శాతం ఉత్తీర్ణత రావాలని, ఎటువంటి కాపీలు జరగరాదన్నారు. అన్ని సబ్జెక్టులు సకాలంలో పూర్తిచేయాలని, వెనుకబడ్డ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ
స్థానిక కళాశాలలో మరణించిన గిరిజన విద్యార్థిని పార్వతి మృతిపై సమగ్ర విచారణ చేపట్టామని దేవర వాసు అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. విద్యార్థిని అనారోగ్యానికి గురైన వెంటనే 108ని పిలిస్తే తక్షణ వైద్య సహాయం అందేన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత బాధ్యులపై చర్యలుంటాయని వాసు తెలిపారు. విద్యార్థిని మృతి ఎలా జరిగిందనే విషయంపై సిబ్బందిని ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ డిడి గోవర్థనరావు, పలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఆయన వెంట ఉన్నారు.
మేయర్ రాజీమానాకు సిద్ధంగా ఉండాలి
రాజమండ్రి, నవంబర్ 28: గోదావరి పుష్కరాల్లో జరిగిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని, తెలుగుదేశం పార్టీ సవాల్ చేసినట్లు మేయర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని వైసిపి ఫ్లోర్‌లీడర్ ఎం షర్మిలారెడ్డి చెప్పారు. శనివారం అఖిలపక్ష నాయకులు విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నగరపాలక సంస్థలో జరిగిన అవినీతిని ప్రజావేదికపై ఆధారాలతో సహా తేల్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విజిలెన్స్ విచారణకు కూడా డిమాండ్ చేస్తామన్నారు. రానున్న కౌన్సిల్ సమావేశంలో గోదావరి పుష్కరాల నిధుల వినియోగం, అవినీతిపై పూర్తిస్థాయిలో చర్చ సాగాలన్నారు. సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, జరగలేదని ప్రకటించడం ప్రజలను వంచించడమేనని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు కూడా అవినీతి జరిగినట్లు పరోక్షంగా పేర్కొన్నారన్నారు. వైసిపి నాయకుడు మంచాల బాబ్జి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు అఖిలపక్షం అంటే కూడా అర్థం తెలియకపోవడం శోచనీయమన్నారు. అవినీతిపై ఆధారాలు కోరుతున్న టిడిపి నాయకులు ఆపార్టీ ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావును సంప్రదించాలని సలహా ఇచ్చారు. టిడిపి నాయకులు గురివిందగింజల తరహాలో విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో జరిగిన అవినీతి జరగలేదని టిడిపి నాయకులే నిరూపించుకోవాల్సి ఉందన్నారు. సిపిఎం నాయకుడు బిబి నాయుడు మాట్లాడుతూ అవినీతి జరగలేదని చెబుతున్న టిడిపి నాయకులు టిడిపి ఫ్లోర్‌లీడర్, బిజెపి, టిడిపి ఎమ్మెల్యేల నుంచి వివరాలు పొందాలన్నారు. మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ డిప్యుటీ మేయర్ గతంలో తమ ప్రాంతంలో మద్యం షాపు వద్దని స్థానికులతో కలిసి ఆందోళన చేశారని, అదే ప్రాంతంలో మద్యం షాపును ఎలా అనుమతించారని నిలదీశారు.
సెమీస్‌కు చేరిన పశ్చిమ గోదావరి జట్లు
రాజమండ్రి, నవంబర్ 28: రాష్టస్థ్రాయి సీనియర్స్ వాలీబాల్ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో పశ్చిమగోదావరి జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. శనివారం జరిగిన సూపర్‌లీగ్ పోటీల్లో పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా జట్లు విజయం సాధించి సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టాయి. పురుషుల విభాగంలో పశ్చిమగోదావరి జట్టు శ్రీకాకుళంను, మహిళల విభాగంలో కృష్ణా జట్టు పశ్చిమగోదావరి జట్టుతోను తలపడ్డాయి. సెమీఫైనల్ పోటీలు శనివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి.