తూర్పుగోదావరి

హోదాకు మించి ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రౌతులపూడి, మే 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక హోదాకు మించి కేంద్రం ప్యాకేజీ అందచేస్తుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. రౌతులపూడిలో సోమవారం ఆయన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బిజెపి యువమోర్చ అధ్యక్షులు కోళ్ల రవి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రంలో బిజెపి ఎదురులేని శక్తిగా అవతరిస్తుందన్నారు. మారుమూల ప్రాంతంలో బిజెపి కార్యాలయం ప్రారంభించి పార్టీని బలోపేతం చేశారని కార్యకర్తలను అభినందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని కార్యకర్తలను కోరారు. రౌతులపూడిలో శిథిలావస్థకు చేరిన శివాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరగా కృష్ణా పుష్కరాల అనంతరం యాభై లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే బలరాంపురం గ్రామంలో ఉన్న పాదాలమ్మ తల్లి ఆలయానికి అయిదు లక్షలు మంజూరు చేయిస్తానన్నారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న మండల బిజెపి అధ్యక్షులు అంకంరెడ్డి రమణను మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు యెనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

రాజమహేంద్రవరం, మే 16: ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఒక జంట పెద్దలకు ఇష్టం ఉండదని, వారు మందలిస్తారన్న భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం బొమ్మూరు ఝాన్సీలక్ష్మీబాయినగర్‌కు చెందిన నుందపల్లి అనూషకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే భర్తతో విభేదాలు వచ్చి కుమార్తెతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. అదే ప్రాంతంలో ఉండే ఆటోడ్రైవర్ మలిశెట్టి భరత్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఆదివారం సాయంత్రం గౌరీపట్నంలో వివాహం చేసుకున్నారు. రాత్రి ఇంటికి వస్తూ దారి మధ్యలో పెద్దలు తిడతారన్న భయంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, వేమగిరిలో పురుగుల మందు సీసాలు కొనుగోలు చేసుకుని, హార్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని కల్వర్టు వద్ద దాన్ని సేవించారు. ఈవిషయాన్ని వారే స్వయంగా కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అస్వస్థతకు గురైన జంటను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బొమ్మూరు పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.