తూర్పుగోదావరి

నీటి ఎద్దడిపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 17: జిల్లాలో ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని, నీటి సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించాలని సూచించారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు మంగళవారం కాకినాడ నగరంలోని జడ్పీ సమావేశ హాలులో జరిగాయి. 2వ స్థాయి సంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన ఛైర్మన్ రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు తాగునీటిని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో అందించేందుకు జడ్పీ చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలతో పాటు పశువుల ఆవాసాల్లో కూడా తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా వివిధ రకాల పింఛన్లను ఉదయం 11 గంటల్లోగా లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేయాలని డిఆర్‌డిఎ అధికారులకు ఆయన స్పష్టం చేశారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకు వెళ్ళి పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలో కొత్తగా రేషన్ కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు కృషి చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరినట్టు డిఎస్‌ఒ జి ఉమామహేశ్వరరావు సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలుకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తమ వంతు కృషి చేయాలని జడ్పీ ఉపాధ్యక్షుడు పెండ్యాల నళినీకాంత్ కోరారు. 3వ స్థారుూ సంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన వ్యవసాయం, పశు సంవర్ధక శాఖలపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని సూచించారు. ఎక్కడా అక్రమాలకు తావులేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తరువాత 4వ స్థారుూ సంఘ సమావేశానికి జడ్పీ ఛైర్మన్ రాంబాబు అధ్యక్షత వహించి, విద్య, వైద్య రంగాలపై అధికారులతో సమీక్షించారు.
పదో తరగతి విద్యార్థులకు జడ్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షలో భర్త కోల్పోయిన మహిళలకు ఉపాధి కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ళ జోగేశ్వరరావు, జిల్లా ప్రజాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె పద్మ, వివిధ శాఖల అధికారులు, జడ్పిటిసి సభ్యులు పాల్గొన్నారు.