తూర్పుగోదావరి

తుపాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 19: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరు విజయకృష్ణన్ అన్నారు. డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. మండలంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎవరూ అనుమతులు లేకుండా సంబంధిత ప్రాంతాల నుండి బయటకు వెళ్లరాదని ఆదేశించారు. స్థానిక సబ్‌కలెక్టరు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా ఈ కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని సబ్‌కలెక్టరు తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబరు 0883 - 2442344కు సంప్రదించాలని తెలిపారు. ఎవరికివారు నిత్యావసర వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా విద్యుత్ వైర్లు తెగిపడకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం డివిజన్‌లోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, తహసీల్దార్ల నంబర్లను సబ్‌కలెక్టరు వెల్లడించారు. ఆలమూరు - 9849903902, గోకవరం - 8008803194, కడియం - 9849903901, కోరుకొండ - 8008003195, రాజమండ్రి రూరల్ - 9849903860, అర్బన్ - 9849903898, రాజానగరం - 9849903900, సీతానగరం - 8008803192 నంబర్లకు సంప్రదించవచ్చని సబ్‌కలెక్టరు వివరించారు.