తూర్పుగోదావరి

రివర్ సిటీకి ప్లాన్ లేదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 24: గోదావరి నది ఒడ్డున చారిత్రక నగరం రాజమహేంద్రవరం. ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ లేకుండా పోయింది. దాదాపు 50 ఏళ్ల క్రితం నాటి అవసరాలతోనే నగర స్వరూపం పరిమితం కావడంతో అభివృద్ధి లేక అస్తవ్యస్తంగా మారింది. ప్రణాళికాబద్ధ అభివృద్ధి లేక కోట్లాది రూపాయల స్థానిక ఆదాయానికి గండిపడుతోంది. ప్లానింగ్ లేని ఈ ప్రాచీన నగరంపై ఇప్పుడు స్మార్ట్‌సిటీ ఆలోచనా విధానంతో కదలికలు మొదలయ్యాయి. రాజరాజనరేంద్రుడు పాలించిన ఈ నగరం విశేషత కల్గిన రివర్ సిటీ. ప్రణాళికాబద్ధ అభివృద్ధికి నోచుకోక అడ్డదిడ్డ రహదారులతో, అస్తవ్యస్త స్వరూపంతో జనజీవనానికి నానా అవస్థలు కల్గిస్తోంది. భౌగోళికంగా నగర విస్తీర్ణం తక్కువ కావడంతో అభివృద్ధికి భూభాగం లేకపోవడం వల్ల.. అందునా నగర మాస్టర్ ప్లాన్ క్రమబద్ధీకరణ లేకపోవడంతో స్థానిక ఆదాయం సైతం కోల్పోయే పరిస్థితి దాపురించింది. 1975లో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తోనే నేటికీ నెట్టుకొస్తోంది. రాజమహేంద్రవరం నగరానికి మాస్టర్ ప్లాన్ సవరణకు కసరత్తు మొదలైంది. పట్టణ స్వరూపం సంతరించుకున్న తర్వాత ఈ రోజుకూ సవరణ లేకపోవడంతో కమర్షియల్ ప్రాంతాలు రెసిడెన్షియల్ జోన్లలో ఉన్నాయి. దీంతో కోట్లాది రూపాయలు నగర పాలక సంస్థకు రావలసిన ఆదాయానికి గండి పడుతోంది. మాస్టర్ ప్లాన్ రివైజ్ లేకపోవడం వల్ల ప్రణాళికాబద్ధ నగరీకరణ జరగలేదు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దలేని పరిస్థితి. అయితే ఎట్టకేలకు ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి సూచనలు, సలహాలతో మాస్టర్ ప్లాన్ సవరణకు కసరత్తు మొదలైంది. స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, పరిసర గ్రామాలను కలుపుకొంటూ నగర విస్తీర్ణం పెరగడంతో జన సాంద్రత పెరిగింది. అడ్డదిడ్డంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్‌కు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, ప్రస్తుత పాలకవర్గం, కమిషనర్ సత్వరం మాస్టర్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. నగరం సమగ్రాభివృద్ధి, నగరపాలిక సంస్థకు ఆదాయం పెరగాలంటే పాలకులు మాస్టర్ ప్లాన్‌పై దృష్టిసారించి తక్షణం కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తేవాలని అందరూ కోరుతున్నారు.
దీనిపై కమిషనర్ విజయరామరాజు స్పందిస్తూ ప్రతిపాదనలు తుది రూపునకు తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వం నుండి ఆమోదం లభించిన తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తుందని చెప్పారు.