తూర్పుగోదావరి

వర్తక బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 17: ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జిల్లాలో వర్తక బంద్ విజయవంతమైంది. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరంలో నిత్యం రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డు, కోటగుమ్మం, వస్తవ్య్రాపార నిలయమైన తాడితోట ఎంజిసి కాంప్లెక్స్‌లోని దుకాణాలు మూతపడ్డాయి. పాలు, మందులు, హోటళ్లకు బంద్ నుంచి మినహాయింపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా దుకాణాలు మూతపడటంతో సుమారు 100కోట్ల వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి. రాజమహేంద్రవరంలోనే సుమారు రూ.10కోట్ల మేర వ్యాపార లావాదేవీలు స్తంభించినట్లు అంచనా వేస్తున్నారు. బంద్ సందర్భంగా రాజమహేంద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నుంచి వర్తకులు మెయిన్‌రోడ్డు, కోటగుమ్మం మీదుగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పించారు. అనంతరం ర్యాలీగా దేవీచౌక్, ఆజాద్‌చౌక్, తాడితోట మీదుగా తిరిగి చాంబర్ ఆఫ్ కామర్స్ భవనానికి చేరుకున్నారు.తొలుత కేంద్రం విధించిన ఒక శాతం సెంట్రల్ ఎక్సైజ్ సుంకానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సువర్ణవర్తకులకు చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. బంద్‌కు సిపిఎం మద్దతు ప్రకటించింది. సిపిఎం నాయకులు టి అరుణ్, ఎస్‌ఎస్ మూర్తి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఫిక్కీ ఎపి కన్వీనర్ అశోక్‌కుమార్‌జైన్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు, గౌరవ కార్యదర్శి కాలెపు రామచంద్రరావు, ఉపాధ్యక్షులు గ్రంధి వెంకటేశ్వరరావు, దొండపాటి సత్యంబాబు, సంయుక్త కార్యదర్శి వెత్సా బాబ్జి, కోశాధికారి క్షత్రియ బాలసుబ్రహ్మణ్యంసింగ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
రోజుకో జిఒ....పూటకో నిబంధన
చిన్న, చిల్లర వర్తకులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రభుత్వం రోజుకో జిఓ పూటకో నిబంధన అమలు చేస్తోందని వర్తకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వీటిని అడ్డం పెట్టుకుని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు చిన్న వర్తకులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. బంద్ సందర్భంగా గురువారం ఈమేరకు సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్టవ్య్రాప్తంగా సుమారు రెండు లక్షల చిన్న వర్తక కుటుంబాల రోడ్డునపడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మూలిగేనక్కపై తాటిపండుపడ్డ చందాన అడ్వాన్స్ వే బిల్లుల పేరుతో వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒక వర్తకుడు ఒకే రకమైన వస్తువులు విక్రయించాలన్న నిబంధనను అమలు చేస్తున్నారన్నారు. విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే ఈతరహా వ్యాపారాలు సాగుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వర్తకులు అన్ని రకాల వస్తువులు విక్రయిస్తేనే కుటుంబం గడుస్తుందని స్పష్టంచేశారు. సువర్ణ వర్తకంపై విధించిన ఒక్కశాతం ఎక్సైజ్ సుంకం వల్ల అధికారుల పెత్తనం, వేధింపులు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన ఎక్సైజ్ విధానం వల్ల 90శాతం జీడిగింజల పరిశ్రమలు సంక్షోభంలో పడ్డాయని, వాటిని కుటీర పరిశ్రమలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఆటోల్లో సరుకుల తరలింపుపై పోలీసుల నిరోధం, జరిమానాల కారణంగా ఇతర ప్రాంతాల వర్తకులు రాజమహేంద్రవరంలో కొనుగోళ్లు తగ్గించారని పేర్కొన్నారు. నగరంలో సుందరీకరణ పేరిట దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.