తూర్పుగోదావరి

ప్రచండ భానుడి ప్రతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 27: తూర్పుగోదావరి జిల్లాలో ఎండ తీవ్రత భీకరంగా మారడంతో రోడ్లపై జనసంచారం కనిపించడం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. శుక్రవారం రాజమహేంద్రవరంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యాపార కేంద్రమైన రాజమహేంద్రవరంలో వర్తక, వాణిజ్య కార్యకలాపాలు మందగించాయి. అపరాల హోల్‌సేల్ వెంకటేశ్వర జనరల్ మార్కెట్, తాడితోట మహాత్మా గాంధీ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్, మెయిన్ రోడ్డు, కోటగుమ్మం జంక్షన్లు ఎండ తీవ్రతకు జనంలేక వెలవెలబోయాయి. ఎండకు కార్యకలాపాలు తగ్గడంతో కోట్లాది రూపాయల వ్యాపారాలు మందగించాయని వ్యాపారులు వాపోతున్నారు. మెయిన్ రోడ్డులోని షాపులన్నీ స్వచ్ఛంద బంద్ పాటించినట్టుగా మధ్యాహ్నం మూసివేసుకోవలసి వస్తోందని వ్యాపారులు అంటున్నారు. ఇదిలా ఉండగా..వేసవి సహాయక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ.3 కోట్లు చొప్పున 13 జిల్లాలకు రూ.39 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా వేసవి చలి వేంద్రాలు కానీ, ఇతరత్రా సహాయక కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్టు కనిపించడం లేదు. ప్రభుత్వం మంచినీటి, మజ్జిగ కేంద్రాలు ఎండమావులుగానే ఉన్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఎక్కడికక్కడ ఎవరికివారే పోటీపడి మరీ మంచినీటి, మజ్జిగ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో పలు సంస్థలు సంయుక్తంగా స్థానిక కోటిపల్లి బస్టాండు జంక్షన్లో వేలాదిమందికి మజ్జిగ సరఫరా చేస్తున్నారు. పోటీపడి మరీ చేస్తున్న ఈ మజ్జిగ పంపిణీలో బాటసార్లు, ప్రయాణికులు ఆగి మరీ సేవిస్తున్నారు. వేసవి తాపానికి గురైన ప్రజలకు అవసరమైన వైద్యసహాయం అందించేందుకు ఎక్కడికక్కడే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేసవి ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటుచేస్తామని చెప్పిన జిల్లా అధికారుల మాట ఇప్పటికీ అమలైన పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వపరంగా చేపట్టవలసిన మజ్జిగ, మంచినీటి చలివేంద్రాల నిర్వహణ మచ్చుకు కూడా కనిపించని స్థితిలో ఇక వైద్య శిబిరాలు ఏ విధంగా ఏర్పాటుచేస్తారంటూ జనం నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఒకటీ అర చలివేంద్రాలను నిర్వహించడం తప్పిస్తే మిగిలిన అన్నిచోట్లా వివిధ సంస్థలు మంచినీటి, మజ్జిగ కేంద్రాలను నిర్వహిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.