తూర్పుగోదావరి

మంద కృష్ణమాదిగ రథయాత్రను అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 27: సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణాకు మద్దతు ప్రకటించిన ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచి చేపట్టిన రథయాత్రను అడ్డుకుంటామని ఎపి ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మాదిగల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చర్మకారులకు ఉపాధి కల్పించే నిడ్‌క్యాప్‌ను పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాల్లో వర్గీకరణను వర్తింపజేసే జిఓ 25ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు చైతన్య యాత్ర చేపట్టినట్లు చెప్పారు. జూన్ 10న విజయవాడలోని ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని ముట్టడిస్తామన్నారు. చంద్రబాబు అంతం మాలల పంతం అని ప్రకటించిన మాలలకు నామినేటెడ్ పదవులు కల్పించడం శోచనీయమన్నారు. మాదిగలను అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కూడా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వర్గీకరణపై ఈసారి తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. గుజరాత్ తరహా ఉద్యమాన్ని చేపడతామన్నారు. త్వరలో ఛలో డిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. రానున్న వర్షాకాల సమావేశాల్లో ఎస్సీల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.