తూర్పుగోదావరి

రూ 17 కోట్లతో గోదావరి కాలువ ఆధునికీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జూన్ 3: ఈ ఏడాది రూ.17 కోట్ల వ్యయంతో బిక్కవోలు నుండి సామర్లకోట వరకూ గోదావరి కాల్వ ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సామర్లకోట గోదావరి కాల్వలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబల్ లైన్ మూడో వంతెన నిర్మాణం పనులకు శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన పూజలు అట్టహాసంగా నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన మంత్రి చినరాజప్ప, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, కాకినాడ ఎంపి తోట నరసింహం తదితర బృందానికి భీమేశ్వరాలయానికి చెందిన అర్చక బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రస్తుతం ఉన్న పురాతన వంతెన సమీపంలో నూతనంగా నిర్మించనున్న మూడో వంతెన నిర్మాణం పనులకు మంత్రి, ఎమ్మెల్సీ, ఎంపి తదితరులు పూజలు చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రాజప్ప మాట్లాడుతూ సుమారు రూ.17 కోట్ల వ్యయంతో గోదావరి కాల్వ అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. సుమారు రూ.50 లక్షల వ్యయంతో తూటేరు అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. భీమేశ్వరాలయం పరిసర ప్రాంతాల్లో రూ.22 లక్షల వ్యయంతో లింకు రోడ్లు అభివృద్ధికి చర్యలు తీసుకొంటున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ మన్యం పద్మావతి చంద్రరావు, వైస్ ఛైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), రైతు సంఘం మాజీ అధ్యక్షుడు డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, రైతుం సంఘం మండల అధ్యక్షుడు కంటే జగదీష్ మోహన్‌బాబు, కార్యదర్శి నెక్కంటి రామ్‌ప్రసాద్, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, కార్యదర్శి బడుగు శ్రీకాంత్, ఎంపిపి గొడత మార్త, వైస్ ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, జడ్పీటీసీ గుమ్మళ్ల రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కెటి సుధాకర్, తహసీల్దార్ డి సునీల్‌బాబు, ఎంపిడిఒ అడపా వెంకటలక్మి, ఇరిగేషన్ ఎస్‌ఇ ఎస్ సుగుణాకరరావు, ఇఇ పి అప్పలనాయుడు, డిఇ పి విజయ్‌కుమార్, వైఐ డివిజన్ ఇఇ జగదీశ్వరరావు, ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు, వైస్ ఛైర్మన్ అడబాల చిట్టిబాబు, సొసైటీ అధ్యక్షుడు పి శ్రీనివాసరావు, తోటకూర శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు, టిడిపి నాయకులు, ఆలయ ఇఒ పులి నారాయణమూర్తి పాల్గొన్నారు.