తూర్పుగోదావరి

కోనసీమలో కొబ్బరి పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబాజీపేట, జూన్ 9: ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలకు అనువుగా ఉన్న కోనసీమలో కొబ్బరి పరిశ్రమల పార్కు నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకుంటామని సిపిసిఆర్‌ఐ డైరెక్టర్ చౌడప్ప తెలిపారు. గురువారం అంబాజీపేటలో సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు స్వగృహంలో విలేఖరులతో మాట్లాడారు. సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిపిసిఆర్‌ఐ) ప్రాంతీయ కార్యాలయం కడియం మండలం జేగూరుపాడు శివారు మాధవరాయుడుపాలెంలో ఏర్పాటు చేయనున్నందున పరిశీలన నిమిత్తం జిల్లాకు రావడం జరిగిందన్నారు. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు తగిన స్థలం 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో పాటు అవసరమైన వౌళిక సదుపాయాలు ఉన్నాయన్నారు. కొబ్బరిని నూరుశాతం ఉపయోగించుకునేలా పరిశ్రమలు నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉండేలా తగుచర్యలు తీసుకుంటామన్నారు. భారతదేశంలో కేవలం 6 శాతం మాత్రమే ఉపయోగిస్తారని ఫిలిఫైన్స్‌లో 67 శాతం అదనపు వస్తువుల తయారీలో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇండోనేషియాలో కొబ్బరి నుండి మానవులకు అవసరమైన వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ షుగర్, చిప్స్, స్వీట్స్ తదితర పదార్థాలు తయారుచేస్తున్నారన్నారు. సమావేశంలో శాస్తవ్రేత్త డాక్టర్ వి నీరల్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీనివాస్, బికెఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమీల్, ఎఎంసి డైరెక్టర్ రవణం రాము పాల్గొన్నారు.