తూర్పుగోదావరి

ఇద్దరు నకిలీ పోలీసులు అరెస్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనపర్తి, మార్చి 17: ఐడి పార్టీ పోలీసులమంటూ ఒక వడ్డీ వ్యాపారిని ఫోన్‌లో బెదిరించిన ఇరువురు వ్యక్తులను అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి అనపర్తి సిఐ ఎస్ రాంబాబు గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలావున్నాయి. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన ఎస్ స్వామిగణేష్‌కు అదే గ్రామానికి చెందిన అయ్యప్పరెడ్డి రూ.60 వేలు బాకీ ఉన్నాడు. ఈ బాకీ నిమిత్తం గణేష్ అయ్యప్పరెడ్డికి ఫోన్‌చేయగా బాకీ నాలుగు రోజుల్లో తీరుస్తానని సమాధానమిచ్చాడు.అదేరోజు సాయంత్రం అయ్యప్పరెడ్డి ఫోన్ నుండి ఇరువురు వ్యక్తులు తాము ఐడి పార్టీ పోలీసులమని, దొంగనోట్లు చలమాణి చేస్తున్నావనే సమాచారం తమ వద్ద ఉందని బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తే కేసు నుండి బయట పడేస్తామని వారు తెలిపారు. ఇలావుండగా అయ్యప్పరెడ్డి ఫోన్ నుండి వచ్చిన కాల్ కావడంతో గణేష్ అతనిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వీరంతా కలిసి తనను ఏదైనా చేస్తారన్న భయంతో గణేష్ అనపర్తి పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మండలంలోని చిన పొలమూరుకు చెందిన కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి నకిలీ పోలీసులుగా గణేష్‌కు ఫోన్ చేసినట్టు గుర్తించారు. బుధవారం పొలమూరు బ్రాందీ షాపు వద్ద వీరు ఇరువురిని అరెస్టుచేశారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నట్టు సిఐ రాంబాబు తెలిపారు.