తూర్పుగోదావరి

ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 13: ముద్రగడ పద్మనాభంకు ఓపిక లేదని, బాగా నీరసించిపోయారని, కనీసం మాట్లాడలేని స్థితిలో కేవలం సైగలు మాత్రమే చేస్తున్నారని ఆయన సోదరి (అక్క) దామిశెట్టి సత్యనారాయణమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ముద్రగడకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు పూర్తిగా చంద్రబాబునాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆవేదన చెందారు. ముద్రగడ సన్నిహిత కుటుంబ సభ్యులు, అక్క, మేనకోడళ్ళు తదితర ఇరవై మంది సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పోలీసులు తమను నానా అవస్థలు పెట్టారని, పోలీసు తనిఖీలను దాటుకుని ఆస్పత్రిలోకి వెళ్ళేసరికి సుమారు గంట సమయం పట్టిందని, ముగ్గురేసి చొప్పున ముద్రగడను చూసేందుకు లోనికి అనుమతించారని తెలిపారు. ముద్రగడ చాలా నీరసంగా ఉన్నారని, వైద్యులు సరైన సమాచారాన్ని బయటకు చెప్పడం లేదనిపిస్తోందని, చాలా ఆందోళనకరమైన స్థితిలో వారంతా ఉన్నారని ముద్రగడ సోదరి వివరించారు. ప్రభుత్వాసుపత్రికి ముద్రగడ చెల్లెలు రావుల రాణి, బావ రావుల నాగేశ్వరరావు, అక్క సత్యనారాయణమ్మ, మేనకోడలు జి సత్యాదేవి, డి.సత్యవాణి (అక్క కోడలు), మరో మేనకోడలు వి సత్యప్రియ తదితరులు వచ్చారు.