తూర్పుగోదావరి

కొనసాగుతున్న నిర్బంధకాండ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 13: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష భగ్నం నేపథ్యంలో అమలాపురంలో కాపునేతల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. కోనసీమ టిబికె జెఎసి కన్వీనర్ కల్వకొలను తాతాజీ ఇంటి వద్ధ, దండువీధిలో దివంగత నల్లా సూర్యచంద్రరావు ఇళ్ళ వద్ధ పోలీసు పహారా కొనసాగుతోంది. సోమవారం కాపుయువత ఛలో రాజమండ్రి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ప్రధాన కూడళ్ళలో గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో యువత ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈదరపల్లి, నల్లవంతెనల వద్ధ భారీగా పోలీసులను మొహరించారు. కాగా నల్లా అజయ్, సంజయ్ దీక్షలు కొనసాగుతున్నాయి. మండలాల్లోని ప్రధాన నాయకులు కదలికలపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి వారు ఎక్కడికి వెళుతున్నదీ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అలాగే కొంకాపల్లి ఎత్తురోడ్డు వద్ద నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో చిక్కాల రవిశంకర్, నల్లా రామకృష్ణ, కైరం రామకృష్ణ, కంచిపల్లి రమేష్ నాయుడు, పేరాబత్తుల హరిబాబు, కుంపట్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అయినవిల్లి మండలం కొండుకుదురులో నిరసన తెలుపుతున్న కాపు యువతను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అడ్డువెళ్లిన మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కోనసీమ వ్యాప్తంగా పోలీసుల నిర్బంధకాండపై కాపుయువత ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.
కడియం మండలంలో...
కడియం: కాపునేత ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా కడియంలో ఆందోళనకు సిద్ధమవుతున్న కాపునేతలను సోమవారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు గృహనిర్బంధం చేశారు. మండలంలో కీలక కాపునేతలను గుర్తించి ఉదయం నుండీ పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి వారు వీధుల్లో సంచరించకుండా చర్యలు తీసుకున్నారు. వైసిపి రాష్ట్ర నేత గిరజాల బాబు, రావిపాటి రామచంద్రరావు ఇళ్ల వద్ద ప్రధానంగా పోలీసులు పహారా కాశారు. దక్షిణ మండల డిఎస్పీ నారాయణరావు స్వయంగా కడియంలోని గిరజాల బాబు నివాసం వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ముద్రగడకు మద్దతుగా ఆందోళనలు చేయాలని మాజీ ఎంపి గిరిజాల వెంకటస్వామినాయుడుతోపాటు సహా మండలంలోని కాపునేతలంతా నిర్ణయించుకోవడంతో వారి వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు పోలీసులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. భారీ వర్గ సమీకరణలు చేస్తున్న రావిపాటి, గిరజాలను లక్ష్యంగా పెట్టుకుని పోలీసులు గృహనిర్బంధం చేయడం పట్ల మండలంలోని కాపునేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి నిరసనలు చేయకుండానే గృహనిర్బంధం చేయడం మానవహక్కులు కాలరాయడమేనని వారు పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో కాపు నాయకులు
ఐ పోలవరం: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్షకు మద్దతుగా ఛలో రాజమండ్రి పిలుపుమేరకు సోమవారం రాజమండ్రి వెడుతుండగా కొమరగిరి సమీపంలో ముమ్మిడివరం సిఐ కెటివి రమణారావు ఆధ్వర్యంలో కాపునేతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పూచీకత్తుల మీద విడుదల చేసారు. ఈ సందర్భంగా కాపు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న కాపు నేతలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చంద్రబాబుతో కుమ్మకై జాతిని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గోదాశి నాగేశ్వరరావు, వాండ్రాసి రామారావు, గోదాశి పుండరీష్, సలాది శేషారావు, ఏడిద దొరబాబు పాల్గొన్నారు. కొత్తపల్లి పెద్దనూతి వీధికి చెందిన వంద మంది బాలబాలికలు ధర్నా నిర్వహించారు.