తూర్పుగోదావరి

2019నాటికి కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 14: కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్ నిర్మాణం 2019నాటికి పూర్తికాని పక్షంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అమలాపురం ఎంపి పి రవీంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం రాజమహేంద్రవరం ఎంపి ఎం మురళీమోహన్ అధ్యక్షతన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం సందర్భంగా అమలాపురం ఎంపి విలేఖరులతో మాట్లాడుతూ కోటిపల్లి-నర్సాపూర్ రైల్వేలైన్ నిర్మాణానికి ఏకకాలంలో పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ లైన్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేసి కోనసీమకు రైలు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కోనసీమ భవిష్యత్‌లో ఎపిలో 13 జిల్లాలకు అతి పెద్ద ఆదాయవనరుగా మారనుందని చెప్పారు. ఓడలరేవు-అంతర్వేది మధ్య ఒఎన్‌జిసి, జిఎస్‌పిసి తదితర సంస్థలు భవిష్యత్‌లో భారీ ఎత్తున చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికితీయనున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి లక్ష కోట్ల వరకు పెట్టుబడులు రానున్నట్టు తెలిపారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు కూడా ఇక్కడ ప్రారంభం కానున్నట్టు తెలియజేశారు. పోర్టుల అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలు కార్యకలాపాలకు రంగం సిద్ధంచేస్తున్న నేపథ్యంలో 2లక్షల యువతకు ఉపాధి లభించే అవకాశం ఉన్నట్టు ఎంపి రవీంద్రబాబు వివరించారు.