తూర్పుగోదావరి

ఉత్కంఠభరితంగా బాడ్మింటన్ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జూన్ 17: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావులపాలెం సిఆర్సీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జిల్లా బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు రెండో రోజైన శుక్రవారం కూడా ఉత్కంఠ భరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో తమ ప్రతిభను కనబరిచారు. అండర్-13 నుండి 70 ఏళ్లలోపు వెటరన్ విభాగాలలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో శుక్రవారం నాటికి బాలికలకు సంబంధించి పలు విభాగాల్లో ఫైనల్స్ పోటీలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి చీఫ్ రిఫరీ ఆర్ కాశీవిశ్వనాథం విజేతల వివరాలు తెలిపారు. అండర్-13 బాలికల సింగిల్స్ విభాగంలో కాకినాడకు చెందిన ఎన్ లక్ష్మీ ప్రణతి అమలాపురానికి చెందిన కె దేవీ శార్వాణిపై ఫైనల్స్‌లో గెలుపొందింది. అలాగే డబుల్స్‌లో రాజమండ్రికి చెందిన ఆర్ సిరిహాస, ఎస్ సమన్విత జోడీ రాజమండ్రికి చెందిన ఎం మానసి, ఎం వైష్ణవి జోడీపై గెలుపొందింది. అండర్-15 విభాగం సింగిల్స్‌లో రామండ్రికి చెందిన ఓలేటి వెనె్నల, కాకినాడకు చెందిన ఎన్ లక్ష్మీప్రణతిపై విజయం సాధించింది. డబుల్స్‌లో రాజమండ్రికి చెందిన ఓలేటి వెనె్నల, బిడి తేజస్విని జంట రాజమండ్రికి చెందిన జి హరిణి, ఆర్ సిరిహాసలపై గెలుపొందింది. అలాగే అండర్-10 విభాగం సింగిల్స్‌లో కాకినాడకు చెందిన వి షన్విత రాజమండ్రికి చెందిన పి నవ్య స్వరూపపై గెలుపొందింది. అయితే డబుల్స్ విభాగంలో వీరిద్దరూ కలిసి ఆడి పిఎస్‌ఎస్ అలేఖ్య, డి దివ్యలపై విజయం సాధించారు. బాలుర విభాగంలో అండర్-13 డబుల్స్‌లో కాకినాడకు చెందిన జిఎస్‌విఎన్ మణితేజ, ఎన్ నాగిరెడ్డి జంట రాజమండ్రికి చెందిన ఎన్ అనిత్ సాత్విక్, ఎ శరణ్ గణేష్‌లపై విజయం సాధించారు. శనివారం రాత్రికి ఈ పోటీలు ముగియనున్నాయి. ఒక్కో విభాగం నుండి నలుగురిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. ఏర్పాట్లను ఎపిబిఎ ఉపాధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి, సిఆర్సీ అధ్యక్షుడు నందం వీర వెంకట సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ కర్రి శ్రీనివాసరెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి పర్యవేక్షించారు.