తూర్పుగోదావరి

కుప్పకూలిన వాంబే గృహాల సన్‌షేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 23: రాజమహేంద్రవరం సిమెంట్రీపేట 2వ వీధిలో గురువారం సాయంత్రం భారీ ప్రమాదం తప్పింది. వాంబే గృహాలకు నిర్మించిన సన్‌షేడ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ప్రమాద స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం ప్రతీరోజూ అక్కడ మహిళలు కుళాయి వద్ద మంచినీరు పట్టుకుంటారని, ఆ సమయంలో కుళాయి రాకపోవడంతో ప్రమాదం తప్పినట్టయ్యింది. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ సందర్శించి, సన్‌షేడ్‌ను పునర్నిర్మించాలని అధికారులను ఆదేశించారు.