తూర్పుగోదావరి

జిల్లాలో ఆరు గ్రంథాలయాలకు సొంత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 19: జిల్లాలోని ఆరు గ్రంథాలయాలకు 80 లక్షల నిధులతో స్వంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదించామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ 2016-17 సంవత్సర బడ్జెట్ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ వీర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో వివిధ ప్రభుత్వ నిధులు వసూళ్లపై సమీక్షించారు. 2016-17 సంవత్సరానికి గాను 16 కోట్ల 3 లక్షలుగా వార్షిక బడ్జెట్ అంచనా వేస్తూ ఆమోదించారు. ఇందులో అధిక భాగం 12 కోట్ల 10 లక్షలు ఉద్యోగులు జీత భత్యాలు, పింఛన్లు, పదవీ విరమణ చెల్లింపులు, బకాయిలు తదితర ఎస్టాబ్లిష్‌మెంట్ వ్యయం కాగా మిగిలినది గ్రంథాలయాల నిర్వహణ, ఆస్తుల అభివృద్ధి కోసం నిర్దేశించారు. ఈ సందర్భంగా వీర్రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల నుండి రావాల్సిన సెస్ బకాయి వసూళ్లను ముమ్మరం చేశామన్నారు. రానున్న సంవత్సరంలో 20 లక్షలతో శాఖా గ్రంథాలయ భవనాలకు మరమ్మతులకు ప్రతిపాదించామని, మరో 80 లక్షలతో కొమరిపాలెం, సవరపాలెం, రామచంద్రపురం, ఏలేశ్వరం, గోకవరం, ప్రత్తిపాడు శాఖా గ్రంథాలయాలకు స్వంత భవనాలను నిర్మిస్తున్నామన్నారు. సుమారు 70 లక్షలతో పాఠకులు, విద్యార్థులు కోరే పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదించామని, 5 ప్రథమ శ్రేణి
గ్రంథాలయాల్లో 4 లక్షల నిధులతో ఆడియో విజువల్ పరికరాలు, 15 లక్షల నిధులతో ఫర్నీచర్ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించామన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు 3 లక్షలను కేటాయించామని వీర్రెడ్డి చెప్పారు. సమావేశంలో గ్రంథాలయ సభ్యులు పి చిరంజీవిని కుమారి, నిమ్మకాయల చెల్లయ్య నాయుడు, గద్దేపల్లి దాసు, వివి కృష్ణారావు, ఎ సత్యనారాయణ, సుంకర రాంబాబు, డిపిఆర్‌ఒ ఎం ఫ్రాన్సిస్, వయోజన విద్య డిడి లక్ష్మీబాయి, సంస్థ కార్యదర్శి ఎం సక్కుబాయి, సంస్థ సిబ్బంది జి త్రినాధ్, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.