తూర్పుగోదావరి

నేరాల నిరోధానికి ప్రత్యేక బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 24: రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లాలో చోరీలు, నేరాల నియంత్రణకు, క్రికెట్ బెట్టింగ్, పేకాట, సింగిల్ నెంబర్ లాటరీ, హైటెక్ వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ బి రాజకుమారి ప్రకటించారు. అలాగే మహిళల రక్షణకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని శుక్రవారం ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో నిర్వహించారు. ఉదయం 10నుంచి రాత్రి 7గంటల వరకు సుదీర్ఘంగా సాగిన ఈసమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలపై నేరాల నిరోధించేందుకు ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. చోరీల నిరోధానికి, చోరీ సొత్తు రికవరీకి 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలన్నారు. రౌడీషీటర్లను పూర్తిగా అణిచివేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. స్టేషన్లకు వచ్చిన ప్రతీ ఫిర్యాదును నమోదు చేయాలన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. రిసెప్షన్ కౌంటర్లను ఈమేరకు తీర్చిదిద్దాలన్నారు. గోదావరి అంత్య పుష్కరాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లుచేయాలన్నారు. తొలుత కేసుల పరిష్కారంపై న్యాయాధికారులతో సమీక్షించారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీ ఆర్ గంగాధర్, డిఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.