తూర్పుగోదావరి

ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జూన్ 24: నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ స్థాయి మెగా జాబ్‌మేళాను శుక్రవారం ఆయన ఇక్కడ ప్రారంభించి మాట్లాడారు. గత పదేళ్ళ నుండి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించడం వల్ల ఇంజనీరింగ్‌తోపాటు ఉన్నత విద్యను ఎక్కువ మంది అభ్యసిస్తున్నారన్నారు. వీరందరికి ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు లేవని, ప్రైవేటు రంగంలోని అత్యధికంగా ఉధ్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉన్నత చదువులు చదివినా నైపుణ్యం లేకపోవడం వల్ల ఇంటర్వ్యూల్లో, ఉద్యోగ పరీక్షల్లో యువత వెనుకబడుతోందన్నారు. నైపుణ్య శిక్షణ సంస్థల్లో చేరడానికి లక్షలాది రూపాయులు వ్యయం చేసే స్తోమత చాలామందికి లేకపోవడం వల్ల ప్రభుత్వం ఉచితంగా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కల్పిస్తుందన్నారు. జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా పది కేంద్రాలున్నాయన్నారు. సామర్లకోటలోని కేంద్రంలో వంద ఖాళీలు ఇప్పటికీ ఉన్నాయన్నారు. ప్రైవేటు రంగంలో వ్యాపార సంస్థలను ఆహ్వానించాలని, ఇదే క్రమంలో తొండంగిలో ఔషధ కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధమైనప్పటికీ ప్రజలు వ్యతిరేకత వల్ల ఈ కంపెనీ ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వ పరంగా తీసుకునే చర్యలకు ప్రజలు తోడ్పాటు అవసరమని కలెక్టర్ అరుణ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలోనే నిరుద్యోగులకు ఉధ్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు. రెండు రోజులు జరిగే ఈ మేళాలో వేలాది మందికి ఉద్యోగాలు లభించే ఏర్పాట్లుచేసినట్లు డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా అన్నారు. జాబ్ మేళాకు సుమారు 15వేల మంది దరఖాస్తు చేసుకోగా 6,332మందికి వివిధ కంపెనీలు ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చాయన్నారు. జాబ్ మేళాకు హాజరైన వారందరికీ వరుపుల రాజా, సుబ్బారావు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి మల్లిబాబు, ప్రత్తిపాడు సర్పంచ్ యాళ్ల విశే్వశ్వరరావు, టిడిపి నాయకులు పర్వత రాజబాబు, పర్వత సురేష్, పైలా సత్యనారాయణ, కొమ్ముల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు సిఐ సత్యనారాయణ సారధ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.