తూర్పుగోదావరి

విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 26: జిల్లాలో ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. మెట్ట, డెల్టా, కోనసీమ సహా గిరిజన మండలాల్లో కూడా అధిక వర్షపాతం నమోదయ్యింది. జిల్లా కేంద్రం కాకినాడ సహా పలుచోట్ల ఎడతెరిపి లేని రీతిలో వర్షాలు కురిశాయి. తీర ప్రాంతంలో వర్షానికి చలిగాలులు తోడయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మెట్ట ప్రాంత రైతుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో సకాలంలో వర్షాలు ప్రారంభమయ్యాయని, ఇవి అపరాలు, దుంప, కర్రపెండలం సాగు రైతులకు అనుకూలంగా మారాయని అధికారులు పేర్కొంటున్నారు. మామిడి పంట దాదాపుగా చేతికి అందిరావడంతో ఈ వర్షాల వలన సాగుదారులకు ఇబ్బంది తప్పిందన్నారు. జిల్లాలో మరో రెండు రోజుల పాటు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం సూచిస్తోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలో 29.3 మిల్లీమీటర్ల సరాసరితో మొత్తం 1874 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
అత్యధికంగా కిర్లంపూడి మండలంలో 142.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా ఐ పోలవరం మండలంలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. గొల్లప్రోలులో 2.0 మిల్లీమీటర్లు, శంఖవరం 3.6, తొండంగి 5.4, కాకినాడ రూరల్, అర్బన్ 6.0, తుని 7.8, ఆత్రేయపురం 8.0, అడ్డతీగల 8.4, రాజోలు 8.8, వి ఆర్ పురం 9.4, కపిలేశ్వరపురం 11.2, రాజమండ్రి రూరల్ 14.4, రాజమండ్రి అర్బన్ 28.2, రాజవొమ్మంగి 30.2, కోటనందూరు 36.6, గంగవరం 75.0, గోకవరం 86.4, మారేడుమిల్లి 108.4, ఏలేశ్వరం 111.2, ప్రత్తిపాడు 123.2, కిర్లంపూడి 142.2 మిల్లీమీటర్ల వంతున వర్షపాతం నమోదయ్యింది.