తూర్పుగోదావరి

ఏ నిర్ణయమైనా మహాప్రసాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, 26: తయారీకి అవసరమైన ముడిసరుకులకు అయ్యే ఖర్చు ఉత్సవ కమిటీ భరించడంతోపాటు, ప్రసాదం పంపిణీకి పూర్తిబాధ్యత వారు వహిస్తే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ గణనాథునికి లడ్డూ మహాప్రసాదం తయారుచేసిస్తానని తాపేశ్వరం సురుచి ఫుడ్స్ సంస్థ అధినేత అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావు (మల్లిబాబు) తెలిపారు. లడ్డూ అక్కడే తయారుచేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుంటామని ఉత్సవ కమిటీ చెబుతున్నట్టు వార్తలొస్తున్న క్రమంలో ఈసారి లడ్డూ ప్రసాదంపై మీమాంస నెలకొందన్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోనే లడ్డూ తయారు చేసుకుంటామంటే తాను సాంకేతిక సహకారం అందించి, వారి అనుమతితో ఒక చిన్న లడ్డూని స్వామివారి పాదాల చెంత సమర్పిస్తానన్నారు. లేకుంటే లడ్డూ తయారీకి అయ్యే ముడి సరుకులకు ఖర్చు వారు చెల్లించుకుంటే మిగిలిన రవాణా, ఇతర ఖర్చులు తాను చెల్లించి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తానన్నారు. ఖైరతాబాద్ గణనాథునికి లడ్డూ తయారీ విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఆదివారం తాపేశ్వరంలోని ఆయన స్వగృహంలో ఆదివారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మల్లిబాబు వివరణ ఇచ్చారు. ఖైరతాబాద్ వినాయకునికి నైవేద్యంగా 500 కేజీల ఉచిత లడ్డూతో ప్రారంభమైన తమ సంస్థ జైత్రయాత్ర 2015 నాటికి ఆరువేల కేజీల వరకు వచ్చిందన్నారు. తన కుటుంబ సభ్యులు, సిబ్బంది సహాయ సహకారాలతో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని లడ్డూ నైవేద్యం సమర్పించేవారమన్నారు. ఏటా లడ్డూ ప్రసాదం పంపిణీలో చోటు చేసుకుంటున్న ఘర్షణ వాతావరణంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నిర్వాహకులు, పోలీసులు లడ్డూ ప్రసాదం పంపిణీలో చేతులెత్తేయడంతో పలు ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఖైరతాబాద్ గణేష్ కమిటీ సభ్యులు సుదర్శన్, రాజ్‌కుమార్, ముఖేష్, రాజేంద్రన్(శిల్పి), సందీప్ తదితరులు తనకు కుటుంబ సభ్యుల కంటే ఆత్మీయులన్నారు. ప్రసాదం పంపిణీలో అనేక వివాదాలు, సవాళ్లు తాను ఎదుర్కొంటున్నానన్నారు. తాను గణనాథుని ప్రసాదం విక్రయించానని వస్తున్న కొన్ని వార్తలు తన మనస్సుని ఎంతో బాధ పెట్టాయని, అమ్మాలనుకుంటే రూ.20 లక్షలు వెచ్చించి ఉచితంగా ఎందుకు లడ్డూ సమర్పిస్తామని ప్రశ్నించారు. మరి కొందరు తనకు 200 షాపులు ఉన్నాయని పసలేని విమర్శలు చేస్తున్నారన్నారు. తనకు తాపేశ్వరంలో 1, కాకినాడలో రెండు షాపులు ఉన్నాయన్నారు. గణపతికి తమ సంస్థ ద్వారా లడ్డూ నైవేద్యంగా సమర్పించిన నాటి నుంచి ఏనాడు వెనక్కు తిరిగి చూడలేదన్నారు. తాను ఎనిమిది మంది సోదరిల అనంతరం జన్మించానని, తన తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ లడ్డూ తయారీ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టానన్నారు. ఒక జాతరలా చవితిని జరుపుకుంటూ ఖైరతాబాద్ గణనాథునికి నైవేద్యం సమర్పించటానికి తరలి వెళ్లేవారమని మల్లిబాబు పేర్కొన్నారు.