తూర్పుగోదావరి

కోనసీమలో మరో రెండు కొబ్బరి కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబాజీపేట, జూన్ 27: కొబ్బరిపై ఆధారపడే రైతులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహంగా కోనసీమలోని అమలాపురం, కొత్తపేటలో కొత్తగా రెండు నాఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకోసం ప్రయత్నిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. అంబాజీపేట మార్కెట్ యార్డు ఆవరణలో నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో అంబాజీపేటతో పాటు రావులపాలెం, ముమ్మిడివరం, నగరం, తాటిపాక మార్కెట్ యార్డులలో, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, విజయరాయిలో నాఫెడ్ కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవికాకుండా మరో రెండు కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వంతో చర్చించినట్టు మంత్రి తెలిపారు. కొబ్బరికాయ ధర పతనమై ఆందోళనలో వున్న రైతులను ఈ కేంద్రాలు ఆదుకుంటాయని భరోసా ఇచ్చారు. క్వింటాల్ కొబ్బరికి రూ.5950 మద్దతు ధర నిర్ణయించడంతో రైతుకు మేలు జరుగుతుందని అన్నారు. దివంగత గంటి మోహన చంద్రబాలయోగి చొరవతో నాఫెడ్ కేంద్రాలు 1997లో తీసుకురావడాన్ని రాజప్ప గుర్తుచేశారు. రైతులు కొబ్బరిలో అంతర పంటలు సాగుచేస్తే మరింత ఆర్థిక పరిపుష్టికి తోడవుతుందన్నారు. యువతను కొన్ని శక్తులు ఆందోళన దిశగా ప్రేరేపిస్తున్నాయని, ఇలా రెచ్చగొట్టేవారిని వదిలేది లేదని హోం మంత్రి హెచ్చరించారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, ఎంపిపి దాసరి వీరవెంకట సత్యనారాయణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు అరిగెల బలరామ్మూర్తి, కొమ్ముల నాగబాబు, గునిశెట్టి చినబాబు, జడ్పీటీసీలు బొంతు గంగాధరరావు, గంగుమళ్ల కాశీ అన్నపూర్ణ, సర్పంచ్‌లు సుంకర సత్యవేణి, కాండ్రేగుల గోపాలకృష్ణ, సొసైటీ అధ్యక్షులు గణపతి వీరరాఘవులు, గణపతి బాబులు, సూదా బాబ్జీ, నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ అధికారులు కె.రమేష్‌కుమార్ రెడ్డి, మధుసూదనరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రియుడి మోజులో భర్త హత్య!
మత్తుమందిచ్చి, రుబ్బురోలుతో కొట్టి, దిండుతో ఆదిమి, ఖాళీ ఇంజక్షను ఇచ్చిన కిరాతకురాలు
రాజమహేంద్రవరం, జూన్ 27: ప్రియుడి మోజులో పడి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కిరాతకంగా హత్య చేసిన మహిళను, ఆమెకు సహకరించిన ప్రియుడ్ని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బొమ్మూరు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తూర్పు మండలం డిఎస్పీ రమేష్‌బాబు ఈకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరపాలక సంస్థలో కాంట్రాక్టు వర్క్ ఇనస్పెక్టర్‌గా పనిచేస్తున్న పూల నారాయణస్వామి అలియాస్ బాబి(41) మోరంపూడి గణేష్‌నగర్‌లోని సూర్యప్రభ ఎన్‌క్లేవ్‌లో భార్య రమాదేవి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. రమాదేవికి నక్కిన వివేకానందకుమార్ అలియాస్ వివేక్‌తో పరిచయమైంది. పరిచయం పెరిగి, వివాహేతర సంబంధానికి దారితీసింది. బయటికి అన్నాచెల్లెళ్లుగా వ్యవహరిస్తూ రమాదేవి, వివేక్‌లు తమ సంబంధాన్ని కొనసాగించారు. 2నెలల క్రితం వ్యవహారం బట్టబయలు కావడంతో రమాదేవి భర్త నారాయణస్వామి ఈవిషయమై భార్యను తీవ్రంగా నిలదీశాడు. దీంతో రమాదేవి తన భర్తను అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది. ప్రియుడు వివేక్‌తో కలిసి ఈనెల 22న మజ్జిగలో మత్తుబిళ్లలు కలిపి ఇచ్చింది. అప్పటికీ నారాయణస్వామి చావకపోవడంతో గ్రైండర్‌లోని రుబ్బురోలుతో దాడి చేసింది. దిండుతో ముఖం అదిమిపెట్టి చంపే ప్రయత్నంచేసింది. అయినా నారాయణస్వామి ప్రాణాలతోనే ఉండటంతో ఓ సినిమాలో చూసిన విధంగా ఖాళీ సిరంజీతో భర్త శరీరంలోకి గాలిని పంపింది. ఇలాచేస్తే గుండెపోటుతో మరణిస్తాడని భావించింది. అయతే అప్పటికీ నారాయణస్వామి మృతి చెందకపోవడంతో రుబ్బురోలుతో విచక్షణారహితంగా కొట్టి చంపింది. అనంతరం నారాయణస్వామి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించింది. ఇందుకు తన తండ్రి దాసరి రామారావు సహకారాన్ని కోరింది. ఆయన న్యాయవాది తోట రమేష్‌బాబుతో కలిసి భార్యభర్తల ఘర్షణలో నారాయణస్వామి మృతి చెందినట్లుగా చిత్రీకరించే ప్రయత్నంచేశారు. సంఘటనా ప్రదేశంలోని ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల విచారణలో రమాదేవి ప్రియుడు వివేక్‌తో కలిసి నారాయణస్వామిని హత్య చేసినట్లు తేలడంతో వారిద్దరిని అరెస్టు చేశారు. అలాగే ఆమె తండ్రి రామారావు, న్యాయవాది రమేష్‌బాబులపై కూడా కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. విలేఖర్ల సమావేశంలో బొమ్మూరు సిఐ కనకారావు తదితరులు పాల్గొన్నారు.