తూర్పుగోదావరి

అమర్‌నాథ్ యాత్రపై ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 28: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్‌నాథ్‌కు తరలివెళ్లడానికి యాత్రికులు పోటీపడుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్ళారు. ప్రస్తుత సీజన్‌లో ఈ ఒక్క జిల్లా నుండి సుమారు వెయ్యి మంది యాత్రికులు అమర్‌నాథ్ వెళ్లారు. గతేడాది 500 మంది లోపు యాత్రికులు మాత్రమే ఈ యాత్రకు వెళ్ళగలిగారు. ఈ సంవత్సరం వివిధ కారణాలతో యాత్రికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఏటా ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర జూన్ 1వరకు జరిగేది. అక్కడి ప్రభుత్వం ఈ ఏడాది నుండి జూలై 1వరకు యాత్ర గడువును పొడిగించడంతో భక్తుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఇటీవలి కాలంలో అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం విశిష్టతలను తెలియజేస్తూ టెలీవిజన్ ఛానెల్స్‌లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారంచేశాయి. యాత్రకు వెళ్ళేవారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం, ప్రైవేట్ ట్రావెల్ ఏజన్సీలు కూడా యాత్రికులను తీసుకువెళ్లడానికి శ్రద్ధ కరబరచడం వంటి కారణాలతో భక్తుల సంఖ్య పెరిగింది. పవిత్రమైన అమర్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్తున్న ఆధ్యాత్మికవేత్తలను వారి సహచరులు, శిష్య బృందాలు అనుసరించడం కూడా యాత్రికుల సంఖ్య పెరిగేందుకు మరో కారణం అయ్యింది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళే యాత్రికులు విధిగా మెడికల్ సర్ట్ఫికెట్లను ప్రభుత్వ వైద్య సంస్థల నుండి పొందాల్సి ఉంటుంది. గుండె జబ్బులు, ఆయాసం, వెన్ను, మోకాలు, కీళ్లనొప్పులు తదితర వ్యాధులున్నవారిని ఈ యాత్రకు అనుమతించే అవకాశం లేదు. ఇందుకు అవసరమైన మెడికల్ సర్ట్ఫికెట్లను గతంలో ఉచితంగా జారీచేసేవారు. ఈ ఏడాది నుండి ఫిట్నెస్ సర్ట్ఫికెట్ ఒక్కింటికి రూ.150 ఫీజు నిర్ణయించారు.