తూర్పుగోదావరి

శాశ్వత ముంపు నివారణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, జూన్ 30: కోనసీమలోని డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరిచి శాశ్వత ముంపు నివారణా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే ఆనందరావుతో కలిసి అల్లవరం మండలం, రామేశ్వరం మొగ, కూనవరం మొగ మూసుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ మొగ మూసుకుపోవడంతో మురుగు నీరు దిగక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. అల్లవరం మండలం రామేశ్వరం మొగ, ఉప్పలగుప్తం మండలం, కూనవరం స్ట్రెయిట్‌కట్ మూసుకుపోవడం వల్ల సమస్య ఉత్పన్నం అవుతోందని ఎమ్మెల్యే ఆనందరావు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఇక్కడ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రామేశ్వరం మొగ, కూనవరం స్ట్రెట్‌కట్‌లను పూడిక తీయించేందుకు అనుమతులు మంజూరుచేయడం జరిగిందని తెలిపారు. జూలై 25వ తేదీలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. అలాగే జిల్లాలోని రెవెన్యూ డ్రెయిన్లలో మూడు వంతుల మేర పూడికతీత పనులు పూర్తిచేసినట్టు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ తాత్కాలిక ఉపశమనమేనని, ప్రభుత్వంతో చర్చించి డ్రెయిన్లపై సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవలసి ఉందని కలెక్టర్ అన్నారు. రామేశ్వరం నుండి సుమారు 3కిలో మీటర్ల మేర మొగ వరకు కలెక్టర్, ఎమ్మెల్యేలు ట్రాక్టర్‌పై ప్రయాణించి మొగ ప్రాంతానికి చేరుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జి గణేష్‌కుమార్, సెంట్రల్ డెల్టా ఇఇ పి సుధాకరరావు, డ్రెయిన్స్ ఇఇ విజయ్‌కుమార్, అమలాపురం ఎఎంసి ఛైర్మన్ గునిశెట్టి చినబాబు, నిమ్మకాయల చెల్లయ్యనాయుడు, మల్లుల పోలయ్య, తహసీల్దార్లు సత్యవతి, పాము సుబ్బారావు తదితరులున్నారు.