తూర్పుగోదావరి

మళ్లీ ప్రొటోకాల్ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జూలై 1: ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ముందు ప్రాధాన్యత అన్న అంశంపై మరోసారి ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖాముఖి తలపడ్డారు. రావులపాలెంలో శుక్రవారం జరిగిన చంద్రన్న రంజాన్ తోఫా సరకుల పంపిణీలో ఈ వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రావులపాలెంలోని 27వ నంబరు రేషన్ దుకాణం వద్ద శుక్రవారం చంద్రన్న రంజాన్ తోఫా సరకుల పంపిణీ ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రతిపక్ష పార్టీలో ఉన్నా తాము సహకరిస్తామన్నారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంకు జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని, అలాగే కొత్తపేట నియోజకవర్గంలో అతిథిగా ఆయనను ఆహ్వానిస్తామని, తాను మాత్రం అధ్యక్షత వహిస్తానన్నారు. దీనిపై ఆర్‌ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనను అతిథిగా పేర్కొనడం సమంజసం కాదన్నారు. జిల్లాలోని ఎంపిటిసిలు, జడ్పీటీసీల ఓట్లతో ఎమ్మెల్సీగా ఎన్నికైన తనకు జిల్లాలోని ఒక నియోజకవర్గాన్ని ఆప్షన్‌గా ఇచ్చుకునే అవకాశం ఉందని, ఆవిధంగా కొత్తపేటను ఎంచుకున్నానని, నియోజకవర్గంలోని ప్రతి కార్యక్రమం తన చేతుల మీదుగానే జరుగుతుందన్నారు. దీనితో వారిరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మీ ఇష్టం వచ్చినట్టు చేయండని, మీరే సరకులు పంపిణీ చేయాలంటూ సరకుల సంచి ఎమ్మెల్సీకి ఇచ్చారు. దీంతో ఆయన మీ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదని, ప్రోటోకాల్ ప్రకారమే పంపిణీ జరగాలని అంటూ సరకులు ఎవరు పంపిణీ చేయాలని తహసీల్దారు సిహెచ్ ఉదయభాస్కర్‌ను ప్రశ్నించారు. దీంతో తహసీల్దారు ఎమ్మెల్సీయే ముందు పంపిణీ చేయాలని అనడంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపధ్యంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఎవరికి వారు సరకులు పంపిణీ చేసి, అక్కడి నుంచి నిష్క్రమించారు. దీంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. సిఐ పివి రమణ, ఎస్‌ఐ పివి త్రినాథ్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రొటోకాల్ ప్రకారం నాకే
ప్రాధాన్యత:సుబ్రహ్మణ్యం
ప్రోటోకాల్ ప్రకారం తనకే ముందు ప్రాధాన్యత ఉంటుందని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. వివాదం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రోటోకాల్ కాపీలను ఆయన విలేఖరులకు చూపించారు. ప్రతి సమావేశంలో ఇలా రభస చేయడం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మానుకోవాలని హితవు పలికారు.
టిడిపిలో చేరని ఎమ్మెల్యేలకు ఇబ్బందులు:జగ్గిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకుని ప్రతిపక్షమే లేకుండా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని, టిడిపిలో చేరని తనవంటి ఎమ్మెల్యేలను తమ నాయకులచేత ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వివాదం అనంతరం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఏ నియోజకవర్గంలోను లేనివిధంగా కొత్తపేటలో ప్రోటోకాల్ అమలవుతోందన్నారు. ప్రోటోకాల్‌పై రాద్దాంతం చేస్తున్న ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆలమూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేత రంజాన్ తోఫా సరకులు పంపిణీ చేయించడం ప్రోటోకాల్ ఎలా అవుతుందో చెప్పాలన్నారు. దీనిపై ప్రివిలైజ్డ్ కమిటీకి, శాసన సభలోను ఫిర్యాదు చేస్తామన్నారు.