తూర్పుగోదావరి

హామీలిచ్చి మోసగించిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జూలై 4: అధికారం కోసం గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు నేడు ఆ హామీలను తుంగలోకి తొక్కి అన్ని వర్గాల ప్రజలను మోసగించారని, దీనిపై కాంగ్రెసు ప్రజల పక్షాన నిలబడి ఇక నుండి నెలకొక ఆందోళన ద్వారా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందని డిసిసి అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం రావులపాలెం సిఆర్సీ ఆడిటోరియంలో డిసిసి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దుర్గేష్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో రైతులను ప్రభుత్వం దారుణంగా మోసగించిందన్నారు. సొసైటీల ద్వారా రూ.లక్ష వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పి నేడు రుణం తీసుకున్న రైతుల నుండి వడ్డీ వసూలుచేస్తున్నారన్నారు. అలాగే ఎస్సీ, బీసీ హాస్టళ్ల మూసివేతకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీనిని తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే చేసేందుకు సిద్ధమవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆదివాసీల సమస్యలపై కాంగ్రెసు జిల్లాలోని రంపచోడవరం కేంద్రంగా ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించిందన్నారు. ఎస్సీ, బిసిలు, మహిళలు, మైనార్టీలు, ప్రతి వర్గానికి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చరని కాపులు, రైతులు, చేనేత కార్మికులు తదితర వర్గాలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు చేస్తున్న చర్యలను కాంగ్రెసు తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా కార్యవర్గంలో మరింతమందికి చోటు కల్పించామన్నారు. కొత్తగా పదవులు పొందినవారు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలపై పోరాడుతూ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎజెవి బుచ్చిమహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ తదితరులు మాట్లాడారు. అనంతరం కొత్తగా పదవులు పొందిన నాయకులకు దుర్గేష్ నియామక పత్రాలు అందజేశారు. అంతకు ముందు నియోజకవర్గ కాంగ్రెసు ఇన్‌ఛార్జి ఆకుల రామకృష్ణ తండ్రి ఆదినారాయణమూర్తి మృతికి సమావేశం సంతాపం తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు, వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా నాయకులు వారికి నివాళులర్పించారు. జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిత్‌మోహన్ మిత్ర, పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్ రాజా, జాయింట్ సెక్రటరీ పొనుగుపాటి శ్రీనివాస్, మహిళా కాంగ్రెసు ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి, ఎస్సీ సెల్ కన్వీనర్ వర్ధినీడి సుజాత, శిక్షణా తరగతుల ఛైర్మన్ రామినీడి మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి సాధనాల శ్రీనివాస్, కార్యదర్శి బివివి లక్ష్మీశ్రావణి, కాశీ లక్ష్మణస్వామి, అంకం గోపి పాల్గొన్నారు.