తూర్పుగోదావరి

వైసిపిలో చేరిన పర్వత ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, జులై 4: ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో సోమవారం వైసిపిలో చేరారు. మండల కేంద్రమైన శంఖవరం గ్రామానికి చెందిన పర్వత ప్రసాద్ దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత సుబ్బారావు అన్న కుమారుడు. కొన్ని అనివార్య కారణాలతో కుటుంబం నుండి బయటకు వచ్చిన ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుపుల సుబ్బారావు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీనితో నాటి నుండి నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీకి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో వైసిపి నుండి ఎన్నికై టిడిపిలోకి ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు చేరడంతో నియోజకవర్గంలో సమర్థుడైన నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రసాద్‌కు వైసిపి నుండి ఆహ్వానం అందింది. దీంతో వైసిపి చేరికపై గత పదిహేను రోజులుగా ఒక పక్కన కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే మరోపక్క వైసిపి నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో విస్తృతంగా చర్చలు, సమావేశాలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లో జగన్ సమక్షంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి చలమలశెట్టి సునీల్‌తో కలిసి వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రసాద్‌తోపాటు పిసిసి అధికార ప్రతినిధి ఎస్ కుమార్‌రాజా కూడా వైసిపిలో చేరారు.