తూర్పుగోదావరి

అలుపెరగని పోరాటం సాగిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి గన్నవరం, జూలై 4: ఊపిరి ఉన్నంత వరకూ కాపుజాతి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం సాగిస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఆయన సోమవారం పి గన్నవరం గ్రామం బోడపాటివారి పాలెంలో కృతజ్ఞతాపూర్వక పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలప్పుడు కాపు జాతికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని కోరుతున్నాను తప్ప, వేరే ఏ రాజకీయ దురుద్దేశం తనకు లేదన్నారు. జాతి భావితరాల భవిష్యత్తు కోసం పోరాటం సాగిస్తున్నానని, తాను చేస్తున్న పోరాటానికి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలని మహిళలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఏనాడూ రోడ్డెక్కని మహిళలు తన కోసం రోడ్డుపైకి వచ్చి పోలీసులు లాఠీలతో కొడుతున్నా, వెనక్కి తగ్గకుండా చేస్తున్న త్యాగాలకు తాను, తన కుటుంబం రుణపడి ఉంటామని ముద్రగడ ఉద్వేగభరితంగా అన్నారు. యువత ఉద్రేకాలకు లోను కాకుండా సంయమనం పాటించి, శాంతియుతంగా పోరాటం సాగించడం ద్వారా హక్కులను సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. మీరందిస్తున్న ఆశీస్సులతో జాతి కోసం పోరాటం ముందుకు సాగిస్తానని ముద్రగడ చెప్పారు. అనంతరం వంగవీటి మోహనరంగా విగ్రహానికి ముద్రగడ పద్మనాభం పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
అంతకు ముందు ముద్రగడ రాకను పురస్కరించుకుని గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివెళ్లి గ్రామం ముఖద్వారం దగ్గర ఘన స్వాగతం పలికి భారీ ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువెళ్ళారు. ముద్రగడ వెంట కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, ఎం మోహన్, నల్లా పవన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల శ్రీనివాస్, యడ్లపల్లి శ్రీనివాసరావు, సిహెచ్ కొండ, సాధనాల శ్రీనివాసరావు, అడ్డగళ్ళ వెంకట సాయిరాం, కె సత్యనారాయణ, కె మల్లిబాబు, ఎ రామాస్వామి నాయుడు, మహిళలు, యువత పాల్గొన్నారు.