తూర్పుగోదావరి

నర్సరీలకు సోలార్ పంపుసెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జూలై 4: జిల్లాలోని కడియం మండల పరిధిలో ఉన్న నర్సరీ రైతులకు 500 సౌరశక్తితో పనిచేసే పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఎపిడిసిఎల్, నెడ్ క్యాప్, డ్వామా అధికారులతో సౌరశక్తి పంపుసెట్ల ఏర్పాటుపై జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కొక్కటి రూ.4.90 లక్షలు ఖర్చుకాగల 5 హెచ్‌పి సౌరశక్తి పంపుసెట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎమ్‌ఎన్‌ఆర్‌ఇ సబ్సిడీ కింద ఒక హెచ్‌పికి 32 వేల 400 రూపాయలు వంతున లక్షా 62 వేల రూపాయలను సబ్సిడీగా ఇస్తుందన్నారు. అదే విధంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ కేంద్రం వారి నిధుల వాటాగా 2.73 లక్షల రూపాయలు అందిస్తారని తెలిపారు. పంపుసెట్ల ఏర్పాటుగా లబ్ధిదారుని వాటాగా చెల్లించవలసిన 55 వేలలో, 5 ఎకరాల లోపు రైతులకు ఎన్‌టిఆర్ జలసిరి నుండి రూ. 40 వేలు అందచేస్తారని కలెక్టర్ అరుణ్‌కుమార్ చెప్పారు. ఈ పథకం అమలుకు లబ్ధిదారులు కేవలం రూ.15 వేలు చెల్లించడం ద్వారా ఈ సౌరశక్తి పంపుసెట్లు పొందవచ్చన్నారు. ఈమేరకు కడియంలోని నర్సరీ రైతులతో సమావేశం వెంటనే నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ఖరారు చేయాలని, ఈ ఎంపికను ఈ నెల 9వ తేదీలోపుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సౌరశక్తి పంపుసెట్ల ఏర్పాటుకు బోర్లు తవ్వడానికి అవసరమైన మెషీన్లను గుర్తించి ఈ పనులు వెంటనే మొదలుపెట్టేలా చూడాలని డ్వామా అధికారులకు ఆయన సూచించారు.
పంపుసెట్ల ఏర్పాటు ద్వారా కడియం నర్సరీ రైతులకు సాగునీటి సౌకర్యం ద్వారా మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో రాజమండ్రి ఎపిడిసిఎల్ ఎస్‌ఇ వైఎఎన్ ప్రసాద్, డివిజనల్ ఇంజనీరు జి శ్యాంబాబు, నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ జి సత్యనారాయణ, ఇఇ జె నానిబాబు, డ్వామా పిడి ఎ నాగేశ్వరరావు, కడియం ఎంపిడిఓ ఎన్‌వివిఎస్ మూర్తి, తహశీల్దార్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.