తూర్పుగోదావరి

రూ.3కోట్లతో సాగునీటి పథకాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటనందూరు, జూలై 5: జిల్లాలోని తాండవ ఆయకట్టు పరిధిలోగల మూడు మండలాల్లో రూ.3కోట్లతో సాగునీటి పథకాలను అభివృద్ధి చేస్తున్నట్టు తాండవ రిజర్వాయర్ ఎస్‌ఇ ఆర్ నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కోటనందూరు మేజర్ కాలువ ఆధునికీకరణ పనులను ఆయన తన సిబ్బందితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండవ ఆయకట్టు పరిధిలోని కోటనందూరు, రౌతులపూడి, తుని మండలాల్లోని 25 సాగునీటి పథకాలను రూ. 2.5కోట్లతో అభివృద్ధిపరుస్తున్నామన్నారు. వీటిలో ఇంతవరకు 10 పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన పనులు ఖరీఫ్‌లోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే నీరు- చెట్టు పథకం కింద మండలంలోని 6 చెరువులను రూ.50 లక్షలతో అభివృద్ధిపరుస్తున్నామన్నారు. విశాఖ జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద రూ.107కోట్లతో 1068 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, ఇంతవరకు రూ.25కోట్లు ఖర్చు చేసి 280 చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. తాండవ రిజర్వాయర్ పరిధిలోని కాలువల ఆధునికీకరణ పనులు రూ.65కోట్లతో చేపట్టామని, ఇంతవరకు 85శాతం పనులు పూర్తి చేశామన్నారు. విశాఖ జిల్లాలోని బలిఘట్టం, కోటవురట్ల, నాతవరం మేజర్ కాలువతోపాటు రిజర్వాయర్ కుడి, ఎడమ ప్రధాన కాలువల లైనింగ్ పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. అయితే మండలంలోని కోటనందూరు, భీమవరపుకోట, టైలాండ్ బ్రాంచి కెనాల్ లైనింగ్ పనులు పూర్తికావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం తాండవ రిజర్వాయర్ నీటి మట్టం 353 అడుగులు ఉందన్నారు. కార్యక్రమంలో ఇఇ మల్లికార్జునరావు, డిఇ చిన్నంనాయుడు, ఎఇ శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.