తూర్పుగోదావరి

గోదావరిలో విద్యార్థి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవిల్లి, జూలై 7: స్నేహితులతో ఆడుకోడానికి వెళ్లిన ఓ విద్యార్థి గోదావరిలో మునిగి గల్లంతవడంతో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రెండు ఇంజను బోట్లతో గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే... అయినవిల్లి మండలం శానపల్లి లంక గరువులో జగడం భీమారావు కుమారుడు జగడం అశోక్ కుమార్ (9) బుధవారం సాయంత్రం తన స్నేహితులతో పక్కనే ఉన్న గోదావరి గట్టుకు వెళ్లాడు. ఇటీవల కురిసి వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో తన స్నేహితులు అశోక్‌కుమార్ చెప్పులు గోదావరిలో విసరడంతో వాటిని తీయబోయి అశోక్‌కుమార్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గురువారం ఉదయం జడ్పీటీసీ గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణకు విషయం తెలియడంతో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు జడ్పీటిసి విషయం తెలియజేశారు. దీంతో హోం మంత్రి రాజప్ప రెండు మరబోట్లు సహాయంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టాలని ఆధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్ళు గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకూ వెతికినా అశోక్‌కుమార్ అచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సంఘటనా స్థలానికి పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి చేరుకుని రెవిన్యూ అధికారులను అప్రమత్తం చేసి అశోక్‌కుమార్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. గల్లంతైన అశోక్ కుమార్ ముక్తేశ్వరంలో 4వ తరగతి చదువుతున్నాడు.