తూర్పుగోదావరి

స్మార్ట్ సర్వేతో ప్రజలకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట జూలై 8: ఆర్థిక, సామాజిక, విద్యా వివరాలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో ప్రజలకు మేలైన సేవలు అందించటానికే ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తోందని కాకినాడ పార్లమెంటు సభ్యుడు తోట నరసింహాం అన్నారు. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో బాదం శ్రీనివాస్ నివాసంలో శుక్రవారం స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సమక్షంలో ఎంపి తోట ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలైన సేవలందించాలనే సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రతి వ్యక్తి తన సమాచారాన్ని పూర్తిస్థాయిలో ఎన్యుమరేటర్లకు అందించాలని కోరారు. అనంతరం గ్రామంలోని రామాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన దివంగత నేత తోట వెంకటాచలం చిత్రపటాన్ని ఎంపి తోట ఆవిష్కరించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఐసిడిఎస్ రామాలయంలో ఏర్పాటుచేసిన టివిల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఎంపి తోట జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తిలకించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో విశేశ్వరరావు, ఎంపిడిఒ ఎ వెంకటలక్ష్మి, తహసీల్దార్ టి రాజగోపాల్, ఎఎస్‌ఓ శ్రీనివాస్, ఏలేరు ప్రాజెక్టు డైరెక్టర్ చదలవాడ బాబి, తోట వరహాలయ్య, తోట అయ్యన్న, అర్‌ఐ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం: జ్యోతుల
సంక్షేమ పథకాల అమలులో సమస్యల శాశ్వత పరిష్కారానికి సాధికారత సర్వే ఉపయోగపడుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ సమక్షంలో స్మార్ట్ సర్వే కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల శ్రీకారం చుట్టారు. ఈసదర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమాచారం ద్వారా సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే అందుతాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంజూనాథ్ కమిషన్‌కు ఈ సర్వే ద్వారా కుల గణాంకాలు పూర్తిస్థాయిలో లభిస్తాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి చంద్రన్న బీమా పథకం ప్రవేశపెడుతుందని, తాపీ మేస్ర్తిలు, తోపుడు బండ్లు, కిళ్లీ బడ్డీలు, ఔట్‌సోర్స్ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులన్నారు. ఈపధకానికి సంబంధించి సమాచారాన్ని కూడా ఈసర్వే ద్వారా సేకరిస్తామన్నారు. సర్వేలో కుటుంబ సభ్యుల వేలిముద్రలు బయోమెట్రిక్ ద్వారా తీసుకుంటారన్నారు. ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్ కేటాయిస్తారన్నారు. ఈకార్యక్రమంలో జగ్గంపేట ఎఎంసి ఛైర్మన్ ఎస్‌విఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, బండారు రాజా, తహసీల్దార్ ఎల్ శివమ్మ, ఎంపిడిఒ సుబ్బారావు పాల్గొన్నారు.