తూర్పుగోదావరి

రైతుపై ప.గో. కలెక్టర్ బంధువు దౌర్జన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, జూలై 10: తమ మధ్య నెలకొన్న భూవివాదాన్ని పరిష్కరించాలని కోరిన ఒక రైతుపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ బంధువు ఒకరు దౌర్జన్యం చేయడంతో గండేపల్లి మండలం పి.నాయకంపల్లి గ్రామంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దౌర్జన్యాన్ని నిరసిస్తూ గ్రామ సర్పంచ్ సహా పలువురు గ్రామస్థులు వారి కారును అడ్డుకున్నారు. ఆ కారు కలెక్టర్ అధికారిక వాహనం కావడంతో సంఘటన పలు మలుపులు తిరిగింది. వివరాల్లోకి వెళితే... గండేపల్లి మండలంలో మెట్ట రాయలసీమగా పిలిచే పి.నాయకంపల్లి గ్రామాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సతీమణి ప్రభాకుందన దత్తత తీసుకున్నారు. గ్రామంలో నిరుపేదలైన కొందరికి మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం సిమెంటు, ఇతర సామాగ్రి, కొంత నగదు అందించారు. అయితే ఈ నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయనే సమాచారంతో ఆదివారం సాయంత్రం కలెక్టర్ సతీమణి, ఆమె తండ్రి సూర్యప్రభాకరరావు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అధికారిక వాహనం (ఎపి 37-ఆర్ 9999) ఇన్నోవా కారులో గ్రామానికి వచ్చారు. ఈసందర్భంగా గ్రామంలోని శివాలయం వద్ద సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉండవల్లి నారాయణమూర్తి, గ్రామస్థులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నిర్మాణాలకు సంబంధించి అన్ని లెక్కలూ చూపించి, ఏవిధమైన అవకతవకలు జరగలేదని గ్రామస్థులు తేల్చిచెప్పారు.
అనంతరం కలెక్టర్ సతీమణి, ఆమె తండ్రి కారులో గ్రామంలోని తమ ఇంటికి వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన విశ్వనాథం సత్యప్రసాద్ అనే రైతు, ఆయన సతీమణి గీత, తల్లి నరసావతి అక్కడకు వచ్చారు. సత్యప్రసాద్‌కు కలెక్టర్ సతీమణి తండ్రి సూర్యప్రభాకరరావుతో కొంతకాలంగా భూవివాదాలున్నాయి. ఈ తగాదాను పరిష్కరించాలని సత్యప్రసాద్ ఈ సందర్భంగా వారిని నిలదీశారు. వారు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహించిన సూర్యప్రభాకరరావు కారు దిగివచ్చి, సత్యప్రసాద్‌పై దౌర్జన్యంచేశారు. ఇది గమనించిన సర్పంచ్ ఉండవల్లి నారాయణమూర్తి సహా గ్రామస్థులు వాహనాన్ని అడ్డుకున్నారు. దీనితో వారిద్దరూ ఆ కారు అక్కడే వదిలేసి, వేరే కారులో తమ ఇంటికి వెళ్లిపోయారు. బాధితుడి కుటుంబం, గ్రామస్థులు కారును అక్కడే నిలిపివేశారు. బాధితుడు సత్యప్రసాద్ కారుముందు పడిపోగా, అతని భార్య, తల్లి విలపించారు. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి, దాడిచేసిన సూర్యప్రభాకరరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కాగా ఈ విషయం తెలుసుకున్న ట్రైనీ ఎస్సై విజయబాబు సంఘటనాస్థలానికి చేరుకుని తగుచర్యలు తీసుకుంటామని హామీయివ్వడంతో కారును వదిలిపెట్టారు.