గుంటూరు

13న శాఖా కార్యాలయాల ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుళ్లూరు, జూలై 11: తాత్కాలిక సచివాలయంలోని 5వ భవనంలో వివిధశాఖల కార్యాలయాలను ఈనెల 13 నుండి ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో నిర్మాణ పనులను ఆయా సంస్థల ప్రతినిధులతో సోమవారం సమీక్షించారు. అనంతరం మీడియాతో నారాయణ మాట్లాడుతూ 5వ భవనంలో అంతర్గత అలంకరణ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయన్నారు. తొలుత రహదారులు భవనాల శాఖ కార్యాలయ నిర్వహణ పనులు ప్రారంభిస్తామన్నారు. మిగిలిన నాలుగు భవనాల నిర్మాణాలు మరో వారం రోజుల్లో పూర్తవుతాయన్నారు. సచివాలయంలో అంతర్గత రహదారుల నిర్మాణం చురుగ్గా సాగుతుందని, ఆగస్టు 21కి అన్నిశాఖల కార్యాలయాలను ప్రారంభించి పరిపాలపాలన ఇక్కడినుంచే కొనసాగించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుండి సచివాలయానికి మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గుంటూరు (కొత్తపేట), జూలై 11: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని టిడిపి తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్ పేర్కొన్నారు. సోమవారం 47వ వార్డు శివనాగరాజు కాలనీలో మొక్కలు నాటడంతో పాటు స్థానికులు పలురకాల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు కాపాడుకునేందుకు మొక్కలు నాటడమే సరైన మార్గమన్నారు. భావి తరాలకు మొక్కలు దోహదం చేస్తాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో గల్లా సైమన్, బేబి, రాణి, మరియబాబు, అనీల్, మహంకాళి, నరసింహారావు, మల్లెంపూడి శ్రీను, రావుల మణి, కెఎంఇ హుస్సేన్, బత్తుల శ్రీను, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

గుడిసెల తొలగింపుతో గగ్గోలు
పొన్నూరు, జూలై 11: పొన్నూరు పట్టణంలోని జిబిసి రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా జరుపుతున్న అధికారులు రోడ్డు మార్జిన్‌లోని గుడిసెల ఆక్రమణల తొలగింపును సోమవారం జరిపారు. తమకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించిన తరువాతనే గుడిసెలు తొలగించాలని గుడిసెవాసులు వారం కిందట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా జరిపిన విషయం పాఠకులకు విదితమే. వారి అభ్యర్ధనను పక్కనబెట్టి గుడిసెలు తొలగింపు జరపడంతో సామగ్రిని రోడ్డు మార్జిన్‌లో పెట్టుకుని తాము ఎక్కడికి వెళ్లాలో తెలియక గుడిసె వాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఉండగా రోడ్డు విస్తరణ కార్యక్రమం పేరిట గంటల పర్యంతరం రోజూ కొనసాగుతున్న కరెంటు కోత బెడద ప్రజలను అవస్థలకు గురి చేస్తోంది.

కు.ని. ఆపరేషన్లలో
జిల్లాకు ప్రథమస్థానం
గుంటూరు, జూలై 11: కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల్లో మరోసారి గుంటూరు జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో డిఎంహెచ్ ఒ టి పద్మజారాణి అవార్డు అందుకున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రెవెన్యూ మంత్రి కృష్ణమూర్తి, మండలి చైర్మన్ డాక్టర్ చక్రపా ణి తదితరుల చేతులమీదుగా డాక్టర్ పద్మజారాణి అవార్డు అందుకున్నారు.