తూర్పుగోదావరి

జలదిగ్బంధంలో కూనవరం మండలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూనవరం: ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో కూనవరం మండలంలో ఉగ్రరూపంతో గోదావరి నది ప్రవహిస్తోంది. మంగళవారం రాత్రి 7గంటలకు కూనవరంలో 43 అడుగులకు గోదావరిలోకి వరద నీరు చేరుకున్నట్టు సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. అర్ధరాత్రి వరకూ గోదావరి వరద ఇలాగే పెరుగుతూ ఆ తర్వాత నిలకడగా ఉంటుందన్నారు. భద్రాచలం నుంచి కూనవరం వరకూ వెళ్లే ప్రధాన రహదారిపై పోలిబాట, గున్నాల కాలనీ, నందిగామ గ్రామాల రహదారులపై వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఎటపాక మండలంలో విద్యుత్తు స్తంభాలు నీట మునగడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. కోనరాజుపేట కాలనీపైకి వరద నీరు చేరుకుంది. నందిగామం గ్రామం వద్ద కల్వర్టు కుంగిపోయింది. వరదల పరిస్థితిని స్థానిక అధికారులు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేయడంతో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు.