తూర్పుగోదావరి

స్మార్ట్ సర్వే కుంటి నడక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, జూలై 15: ఎంతో ప్రతిష్టాత్మకంగా స్మార్ట్ సర్వేను ప్రభుత్వం చేపట్టింది. ఆచరణలోకి వచ్చేసరికి మొరాయిస్తున్న మిషన్లు, విసుగు చెందుతున్న సిబ్బందితో కుంటినడక నడుస్తోంది. ఒక్కో వ్యక్తిపై 20 నిమిషాల్లో 20 ప్రశ్నలు సంధిస్తుంటే సరైన సమాధానాలు రాక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమించడంతో వారి వేలిముద్రలతోనే సమాచార సేకరణ ట్యాబ్‌లు ప్రారంభమవుతున్నాయ. ఒక అధికారికి మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను సహాయకులుగా నియమించి పనులు చేయిస్తున్నారు. మిషన్లు సరిగ్గా పనిచేయకపోతే సహాయ సిబ్బందికి డబ్బులు వస్తాయోరావో అనే ఆందోళన మరోపక్క వెంటాడుతోంది. ఒక వ్యక్తిపేరు, వివరాలు నమోదు చేస్తే ప్రైవేటు వ్యక్తికి రూ.2 ఇస్తారని, నమోదు కాకపోతే పరిస్థితి ఏంటని వారు దిగాలుగా ఉన్నారు. జవాబు చెప్పేవారు సర్వే సమయాన్ని వృథా చెయడంతో పాటు తమ పథకాలు పోతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరువాత చెపుతాము, మగవారులేరు అని సర్వేను తిరస్కరిస్తున్న దాఖలాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ సర్వే కాస్తా అనుకున్న సమయం కన్నా ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలావుండగా సర్వే పేరుతో అధికారులు ఉదయం ఏడు గంటలకే రోడ్డెక్కడంతో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. పనులు కోసం వచ్చిన వారికి నిరాశ మిగులుతోంది.