తూర్పుగోదావరి

పంటలు ఎండిపోనివ్వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 15: పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలోని భూములకు వెంటనే నీరందేలా కాలువల మెరకలు తొలగించి నీటి విడుదల పెంచి పంటలు ఎండిపోకుండా తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధిగృహంలో జలవనరుల శాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రెండు ప్రాంతాల్లో విభిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. ఒక పక్క గోదావరి వరద ఉద్ధృతితో నీరు ఎక్కువై కోనసీమ ప్రాంతంలో భూములు మునిగిపోతున్నాయని, పిబిసి కాలువలో నీరు సరిగ్గా లేక మెరక, శివారు భూములకు నీరందటం లేదన్నారు. 450 టిఎసిల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని, ఏలేరులో నీరిచ్చే పరిస్థితి లేదని రాజప్ప చెప్పారు. పుష్కర కాలువ ద్వారా గోదావరి నీటిని ఏలేరుకు తరలించి మెట్ట ప్రాంత మొదటి పంటకు సాగునీరు ఎద్దడి నివారించేందుకు గోదావరి- ఏలేరును అనుసంధానం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశామన్నారు. పుష్కర కాలువ కింద ప్రస్తుతం ఉన్న భూముల సాగునీటి వసతికి ఇబ్బంది రాకుండా లిఫ్ట్ పంపులను మరిన్ని పెంచి ఏలేరుకు నీరందించాలని కోరామన్నారు. పిబిసి కాలువలో నీటి ప్రవాహం తగినంత లేకపోవడంతో సంబంధిత అధికారులతో రాజప్ప సమీక్షిస్తూ కాలువల మూసివేత కాలంలో నిర్వహణ పనులను సకాలంలో పూర్తిచేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావన్నారు. పూడిక, గుర్రపు డెక్కను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. పిబిసికి అవరోధం కలిగిస్తున్న మెరకల తొలగింపును వెంటనే చేపట్టి నీటి విడుదల పరిమాణం పెంచి పంటలకు నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాజప్ప ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, ఎస్వీఎస్‌ఎన్ వర్మ, నీటిపారుదల శాఖ ఎస్‌ఇ బి రాంబాబు, హెడ్‌వర్క్స్ ఇఇ ఎన్ కృష్ణారావు, డ్రైనేజీ ఇఇ విజయ్‌కుమార్, ఏలేరు డివిజన్ ఇఇ ఎస్ జగదీశ్వరరావు, పిఠాపురం డిఇఇ జి శేషగిరావు, ఎఇఇ రెహమాన్ పాల్గొన్నారు.