తూర్పుగోదావరి

ఆలమూరు పిహెచ్‌ఎన్‌సి తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, జూలై 17: మండల కేంద్రం ఆలమూరులోని ప్రాథమిక హెల్త్ న్యూట్రిన్ సెంటర్ (పిహెచ్‌ఎన్‌సి)ను ఆదివారం నుండి తొలగించినట్లు ఆ కేంద్రానికి ఉత్తర్వులు అందాయి. ఈ కేంద్రం గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించారు. గ్రామీణులకు ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంగా ప్రారంభించిన ఈ కేంద్రం ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించలేకపోవడంతో అందులో పనిచేస్తున్న సిబ్బందిని పలు ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం సిహెచ్‌ఒ ఎఎస్ లక్ష్మిని రాయవరం, హెల్త్ అసిస్టెంట్ ఎన్ సత్యనారాయణను ద్వారపూడి, డిసిఎం ఎస్ సత్యనారాయణను పామర్రు బదిలీ చేశారు. కాగా డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ డి సాయిప్రసాద్ బదిలీ అయితే అయ్యారుగానీ ఆయనను ఎక్కడకు వేశారనేది ఇంకా తెలియరాలేదు.