తూర్పుగోదావరి

నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, జూలై 17: నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా తాటి దుంగలతో రోడ్డు పక్కన నిలుపుదల చేసిన ట్రాక్టర్ మృతు శకటంగా మారి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు యువకులను దుర్మరణంపాలు చేసింది. రెండేళ్లుగా తమ కష్టార్జితంతో కుటుంబానికి చేయూతగా నిలుస్తున్న యువకులు రోడ్డు పక్కనే నిర్జీవంగా కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. అందొచ్చిన కుమారులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో విషాదంలో మునిగిపోయారు. జగ్గంపేట శివారు 16వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదలో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి గ్రామానికి చెందిన స్నేహితులు షేక్ నబీసాహెబ్ (20), ఓరుగంటి దుర్గారావు (22), వేల్పూరి శ్రీహరి (20) మృతిచెందారు. దొండపూడి నుంచి మోటార్ సైకిల్‌పై ముగ్గురు యువకులు కత్తిపూడి వెళుతుండగా రోడ్డు పక్కనే నిర్లక్ష్యంగా నిలుపుదల చేసిన తాటి దుంగల ట్రాక్టర్‌ను దూరం నుంచి గమనించలేదు. బైక్‌ను నబీసాహెబ్ నడుపుతూ ట్రాక్టర్‌ను గమనించే లోపే తాటి దుంగలు ముగ్గురు తలలకు బలంగా తగలాయి. ఈ ప్రమాదంలో ముఖం, కళ్లు, తలలకు బలమైన గాయాలవ్వడంతో తీవ్ర రక్తస్రావంతో ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురిలో ఒకరికి కళ్లు పైకి రాగా తలలు పగిలిపోయాయి. ముగ్గురు తలల మాంసం ముద్దలు ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌లోని తాటి దుంగలకు అంటుకుని ఉండడాన్ని బట్టి ప్రమాద తీవ్రత అర్ధమవుతుంది. ప్రమాద స్థలానికి పక్కనే రాజపూడికి చెందిన బూసాల సత్యనారాయణకు చెందిన సామిల్లు ఉండడంతో జగ్గంపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మునస రమణ తాటి దుంగల లోడును ట్రాక్టర్‌తో తీసుకువచ్చి సామిల్లులో కాకుండా రోడ్డు పక్కనే నిర్లక్ష్యంగా ప్రమాదానికి కొద్దిసేపు ముందు విడిచి పెట్టడంతో ఘోరం చోటుచేసుకుంది. ఉదయం 6 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాల గురించి ఆరా తీశారు. పెద్దాపురం ఇన్‌చార్జి సిఐ శ్రీధర్‌కుమార్, ఎస్సై అలీఖాన్, పిఎస్సై కిషోర్ సిబ్బందితో ప్రమాదాల కారణాల గురించి విచారించారు. మృతుల వివరాల గురంచి సుమారు రెండు గంటల పాటు ప్రయత్నం చేయగా సెల్‌ఫోన్ ఆధారంగా పశ్చిమగోదావరి జిల్లా వాసులుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సిఐ పర్యవేక్షణంలో ఎఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను, డ్రైవర్‌ను ఆదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆధారాలు మాయం చేసేందుకు యత్నం
తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ముగ్గురు మృతిచెందడంతో అందుకు కారణమైన ట్రాక్టర్‌ను సంఘటనా స్థలం నుంచి వేరే చోటుకు మార్చడం అనుమానాలకు తావిస్తోంది. తెల్లవారు జామున జరగడంతో ఎవసూ గుర్తుపట్టరనే ఉద్దేశంతో తాటి దుంగలతో ఉన్న ట్రాక్టర్‌ను డ్రైవర్ కొద్ది దూరం తీసుకుపోయి పక్కన ఉంచాడు. అయితే ప్రమాదం గురించి పోలీసులు చుట్టుపక్కల విచారించగా ట్రాక్టర్ గురించి సమాచారం అందుకుని పరిశీలించారు. తాటి దుంగలకు రక్తం, మాంసం ముద్దలు అంటుకుని ఉండడంతో పెద్దాపురం సిఐ శ్రీధర్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. డ్రైవరును, ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకుని సామిల్లు నిర్వాహకులను తీవ్రంగా హెచ్చరించారు. సాక్ష్యాలు దొరక్కుండా చేసే భాగంలోనే ట్రాక్టర్‌ను ప్రమాద స్థలం నుంచి పక్కకు తీసివేశారని పోలీసులు తెలిపారు.
* విషాదంలో కుటుంబ సభ్యులు
స్నేహితులైన షేక్ నబీ సాహెబ్, దుర్గారావు, శ్రీహరి లారీ క్లీనర్‌లుగా పనిచేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నారు. దుర్గారావు డ్యూటీ దిగి ఇంటికి వెళ్లవలసి ఉండగా నబీ సాహెచ్ కత్తిపూడిలో ఉన్న లారీపై డ్యూటీ ఎక్కేందుకు మోటార్ సైకిల్‌పై దించాలని మిగిలిన ఇద్దరినీ కోరాడు. ముగ్గురు కలిసి స్వగ్రామం నుంచి బైక్‌పై కత్తిపూడి వెడుతూ ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. నబీ సాహెబ్‌కు తండ్రి వల్లి, తల్లి మదీనా బీబీ, సోదరుడు, సోదరి ఉన్నారు. క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కుమారుడు చనిపోయాడని తెలుసుకున్న వల్లీ పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి కుప్పకూలిపోయాడు. దుర్గారావు, శ్రీహరిలకు తండ్రులు లేరు. దుర్గారావుకు తల్లి, ముగ్గురు సోదరులు ఉన్నారు. కమ్మర పని చేసుకునే ఈ కుటుంబంలో దుర్గారావు ఒకడే క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. అలాగే శ్రీహరికి తల్లి, సోదరి ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కొడుకు చనిపోవడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇద్దరు కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌కు వచ్చి అనంతరం పెద్దాపురం మార్చురీ వద్దకు వెళ్లి రోదించారు.

ఆంధ్రభూమి బ్యూరో