తూర్పుగోదావరి

తుని చేరిన కాంగ్రెస్ రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, మార్చి 22: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు దళిత, ఆదివాసీ, బిసి, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారత యాత్ర చేపట్టినట్టు కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం తెలిపారు. యాత్ర ఉత్తరాంధ్రలో ముగించుకుని మంగళవారం జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా తుని కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ పాండురంగారావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత, బడుగు బలహీన వర్గాల ఉన్నతికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ఆయా వర్గాల వారికి న్యాయం చేసిందని చెప్పారు. బిజెపి దళిత వ్యతిరేక పార్టీయని, అంబేద్కర్ వంటి జాతీయ నేతలను మరచిందన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయని, వీరు అందిస్తున్న పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. సంక్షేమ పాలనకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రి శైలజానాథ్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.