తూర్పుగోదావరి

పోలవరం... నిధులే కలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 18: పోలవరం ప్రాజెక్టు నిధుల గండం నుంచి బయటపడలేదు. దీంతో ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం కేంద్ర నిధులతోనే పూర్తిచేయాల్సి వుంది. పూర్తి నిధుల మాటెలావున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులను మంజూరుచేసే విషయంలోనే డోలాయమాన పరిస్థితి నెలకొనివుంది. దీంతో లక్ష్యం మేరకు అంటే 2018 నాటికి పోలవరం పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గాల అనే్వషణలో భాగంగా కొత్తకొత్త ఎత్తిపోతల పథకాలు పుట్టుకొస్తున్నాయని తెలుస్తోంది. ఏదో విధంగా గోదావరి నీరును ఒడిసిపట్టడమే లక్ష్యంగా ఎత్తిపోతల పథకాలను రూపొందించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గోదావరి ఎడమ గట్టుపై మరో ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారని తెలుస్తోంది. పోలవరం లక్ష్యం మేరకు విశాఖ వరకు నీళ్లను తీసుకెళ్లాలంటే ఎడమ కాల్వకు లిఫ్ట్ పెట్టి నీటిని తోడి ఆ నీటిని పట్టిసీమ నుంచి తీసుకెళ్లినట్టే ఏలేరుకు అనుసంధానంచేసి అక్కడ నుంచి విశాఖ తరలించడానికి పథకం రూపొందించినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే పట్టిసీమ పోలవరంలో భాగం కాదని పోలవరం అథారిటీ పేర్కొంటోంది. ఇపుడు ఎడమ గట్టుపై ఏ పథకంలో భాగంగా మరో లిఫ్ట్ నిర్మిస్తారో స్పష్టం కావాల్సి వుంది. ఇప్పటివరకు పోలవరం కోసం ఖర్చుచేసిన నిధులే కేంద్రం నుంచి మంజూరుకాలేదు. ఇపుడు కొత్తగా నిర్మించనున్న మరో లిఫ్ట్‌కు ఏ విధంగా నిధులు సమకూర్చుకుంటారనేది స్పష్టం కావాల్సి వుంది.
ఈ విషయం పక్కనపెడితే.. పోలవరం కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు.. కేంద్రం నుంచి ఇంకా ఎంత రావాల్సి వుంది అనే విషయంపై వివరాలు పరిశీలిస్తే ప్రాజెక్టుకు నిధుల గండం ఎదురైనట్టుగా కన్పిస్తోంది. అందుకే లక్ష్యం సాధన దిశగా సంకట స్థితి కన్పిస్తోంది. లక్ష్యం మేరకు పోలవరం నిర్మాణం జరగాలంటే నిధుల గండం నుంచి బయటపడాలి. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తామని చెప్పి, అవసరమైన నిధులన్నీ ఇస్తుందని పేర్కొంటున్నా ఇప్పటివరకు రాష్ట్రం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయడంలో మాత్రం కేంద్రం నుంచి స్పందన కానరావడం లేదు. దీంతో నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. పోలవరం నిధులకు సంబంధించి రాష్ట్రం రుణం తీసుకుంటే.. ఆ రుణానికి కేంద్రం గ్యారంటీ ఇస్తుందనే ఒక వాదన కూడా విన్పిస్తోంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 90 (1) ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. సెక్షన్ 90 (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేంద్రం నియంత్రణలోకి తీసుకుంది. సెక్షన్ 90 (4) ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు ఇప్పించడంతో పాటు కేంద్రమే ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు 2010-11 ధరల ప్రకారం రూ.16,010 కోట్లు ఖర్చవుతుందని లెక్కించారు. ప్రస్తుత ధరల ప్రకారం రూ.36 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనావేశారు. ఈ ప్రాజెక్టుకయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం భరిస్తే, 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంటుందని, రాష్ట్రం భరించే 40 శాతం నిధులకు కూడా నాబార్డు రుణం తీసుకుంటే అందుకు కేంద్రం ష్యూరిటీ ఇస్తుందనే వాదన కూడా విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం నిధుల విషయంలో తాత్సారం జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్ నిధులు రావడంలో ఆలస్యమై పోలవరం లక్ష్యం మేరకు పనులు జరగడంలో జాప్యానికి తావులేకుండా రాష్ట్రం తన బడ్జెట్‌లో పోలవరం కోసం రూ.3500 కోట్లు కేటాయించుకుంది. ఇప్పటి వరకు పోలవరం కోసం రూ.8,187 కోట్లు ఖర్చు చేయగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రూ.2639 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.835 కోట్లు వచ్చాయి. మిగిలిన నిధుల కోసం రాష్ట్రం మల్లగుల్లాలు పడుతోంది. అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అధారిటీ అధికారులతో, ప్రధానితో, సంబంధిత కేంద్ర మంత్రులతోనూ చర్చలు జరిపి వస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం ఖర్చు చేసిన నిధుల్లో ఇంకా రూ.1804 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి వుంది. ఏదేమైనప్పటికీ నిధులు సకాలంలో కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్ అయితేనే తప్ప పనులు లక్ష్యాలను అధిగమించలేదని స్థితి నెలకొంది. ప్రస్తుత నిధుల పరిస్థితి చూస్తుంటే పోలవరం ఎప్పటికయ్యేనో అనే అనుమానాలు కలగక మానవు.

ఆర్టీసీ బస్సులకు బయో డీజిల్

రాజమహేంద్రవరం, జూలై 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్టీసీ) కాలుష్య రహిత ఇంధన వినియోగానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ పరిరక్షణతోపాటు డీజిల్ ఖర్చులో ఆదా చేయడంలో భాగంగా బయో డీజిల్ వినియోగం ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా జిల్లా రీజియన్ పరిధిలో బయోడీజిల్ వినియోగాన్ని అంచలంచెలుగా చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఐదు డిపోల్లో బయోడీజిల్ వినియోగం చేపట్టారు. డీజిల్, పెట్రోలు వినియోగంలో వెలువడే కర్బన ఉద్గారాలు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాలుష్యం పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆర్టీసీ వినియోగిస్తున్న బస్సుల కండీషన్‌ను బట్టి ఈ కాలుష్యం మరింతగా ఉంటోంది. ఈ బస్సుల నుంచి విడుదలయ్యే ప్రమాదకరమైన వాయువుల వల్ల పరిసర ప్రాంతాలు నల్లగా మారిపోతుంటాయి. ఈ పొగ నుంచి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంటాయి. ఇవి గాలిలో కలిసి మరింత ప్రమాదకర వాయువులుగా పరిణమిస్తాయి. వీటి వల్ల చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు వ్యాపిస్తాయి.
ఇటువంటి పరిస్థితులను నియంత్రించడానికి బయో డీజిల్‌ను వినియోగించడంవల్ల ఖర్చులో ఆదాతోపాటు పర్యావరణానికి మేలు చేకూరుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఆర్టీసీ రోజుకు 55వేల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుంది. ఇందులో రెండు శాతం అంటే ఐదు వేల లీటర్ల వరకు ప్రయోగాత్మకంగా బయో డీజిల్‌ను వినియోగించడానికి చర్యలు చేపట్టారు. లీటర్ డీజిల్ ధర రూ.61 కాగా బయో డీజిల్ ధర రూ.54. 10 లీటర్ల డీజిల్‌లో ఒక లీటర్ బయో డీజిల్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల 55 వేల లీటర్ల డీజిల్‌కు రూ.33.55 లక్షలు ఖర్చవుతుంటే, బయోడీజిల్ వినియోగం వల్ల రూ.30.25 లక్షలకు తగ్గుతోంది. అంటే రోజుకు సుమారు రూ.3 లక్షల వంతున నెలకు సుమారు రూ.90 లక్షల వరకు ఆదా అవుతోంది. ఇదేవిధంగా అన్ని డిపోల పరిధిలోనూ బయో డీజిల్ వాడకాన్ని పెంచడానికి చర్యలు చేపడుతున్నారు.
అవినీతిరహితంగా ప్రజలకు అందాలి

ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు
రావులపాలెం, జూలై 18: రావులపాలెం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాత్రి ఏడు గంటల వరకు వాతావరణం సాధారణంగా ఉన్నా తరువాత నుండి అనూహ్య మార్పులు చోటు చేసుకుని ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. అనంతరం కొద్ది సేపటికే భారీ వర్షం గంట సేపు కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముమ్మిడివరప్పాడు తదితర గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆయా గ్రామాల్లో అధికారులు ప్రజలతో కలిసి కూలిన చెట్లను తొలగించారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో
ఇ-ఆఫీసు ఫైళ్లకే అనుమతి
-కలెక్టర్ అరుణ్‌కుమార్

కాకినాడ, జూలై 18: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక ఇ-ఆఫీస్ ఫైళ్లను మాత్రమే అనుమతిస్తామని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో 15 కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ విధానం ఇప్పటికే అమల్లో ఉందన్నారు. మరో 25 కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలుచేయనున్నట్టు చెప్పారు. మొత్తం 80 కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న స్మార్ట్‌పల్స్ సర్వే ప్రక్రియలో ఇబ్బందులను తొలగించే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో ఆగస్టు నెలాఖరుకు లక్ష్యాల మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సామాజిక వన పథకం కింద జిల్లాలో కోటి 50 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. 50 లక్షల జీడి మామిడి మొక్కలను నాటనున్నట్టు తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగా ఉందని, అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహించాలని అధికారులను కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాలు, ఇళ్ల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలియజేశారు. వనం-మనం కార్యక్రమం ద్వారా ఒకేచోట 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు నాటేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో పంట గుంతల తవ్వక్ఘానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జలసిరి కింద రెండవ విడతలో గుంతలు చేపట్టే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో రైతులు పంట గుంతలను తవ్వేందుకు ప్రోత్సహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు కృషి చేయాలని వ్యవసాయ శాఖ, డిఆర్‌డిఎ, డ్వామా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఇ-ఆఫీస్ అమలు ద్వారా 1835 ఫైళ్ళ మూమెంట్ ద్వారా జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నట్టు చెప్పారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్-2 జి రాధాకృష్ణమూర్తి, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, జిల్లా పరిషత్ సిఇఒ కె పద్మ, బిసి కార్పొరేషన్ ఇడి ఎం జ్యోతి, డ్వామా పిడి నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బి ఎస్‌ఇ మూర్తి, సిపిఒ మోహన్‌రావు, వ్యవసాయ శాఖ జెడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.