తూర్పుగోదావరి

కాకినాడ రూరల్‌లో కొక్కొరోకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జూలై 19: చట్టాలను రక్షించాల్సిన వారే చట్టవిరుద్ధంగా వ్యవహరించి కోడి పందేలపై దాడి కేసును గప్‌చుప్ చేసేశారని కాకినాడ రూరల్ ప్రాంతం కోడై కూస్తోంది. ఈ దాడిలో దొరికిన నగదు ఏమైందోగానీ, స్వాధీనం చేసుకున్న కోళ్లను మాత్రం పంచుకుని, నంచుకు తినేశారని సమాచారం. దాడిచేసి, ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ఒక యువ అధికారి మాత్రం సీనియర్ల తీరుకు బిత్తరపోతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... కాకినాడ రూరల్ మండలంలోని ఓ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఓ యువ అధికారి కొంతమంది సిబ్బందితో కలిసి గత శనివారం సాయంత్రం సమయంలో దాడిచేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీగా నగదు, 10 కోడి పుంజులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం. అయతే ఆ స్టేషన్ అధికారి కేసు దర్యాప్తు పేరుతో కోడి పుంజులు, నగదును తీసుకుని అదుపులోకి తీసుకున్న వారిని స్టేషన్ నుండి పంపించి వేసినట్లు తెలిసింది. కోడి పుంజు ఒక్కొక్కటీ 10 వేల రూపాయలకు పైగా విలువ చేస్తుందని, వాటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటాయని సమాచారం. కాగా ఈసంఘటన జరిగిన మరుచటి రోజు ఆదివారం కావడంతో స్వాధీనం చేసుకున్న పది కోడి పుంజులను వధించి స్టేషన్ సిబ్బంది ఆ మాంసాన్ని పంచుకున్నారని రూరల్ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుటుంన్నారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న లక్షా 20 వేల రూపాయలు నగదును సైతం సదురు రక్షక భటులు స్వాహా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా కోడి పందాల కేంద్రంపై దాడిచేసి పెద్ద ఎత్తున కోడి పుంజులు, నగదును సీజ్ చేసిన ట్రైనీ ఎస్సై జరిగిన ఘటనపై తీవ్ర విస్మయానికి గురైనట్టు తెలిసింది. శిక్షణ సమయంలో తనను ఉన్నతాధికారులు ప్రోత్సహించాల్సింది పోయి ఈ విధంగా వ్యవహరించడం పట్ల ట్రైనీ ఎస్సై ఆవేదన వ్యక్తంచేనట్టు బాధితులు తెలియజేశారు. కాకినాడ రూరల్ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ఉన్నతాధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది రక్షక భటులు రెచ్చిపోతున్నారని రూరల్ ప్రాంత ప్రజలు ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరపాల్సిన అవసరం ఉంది.