తూర్పుగోదావరి

స్మార్ట్ సర్వేకు సాంకేతిక బ్రేకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 21: జిల్లాలో జరుగుతున్న స్మార్ట్ పల్స్ సర్వేలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు తప్పడం లేదని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో ఎదురవుతున్న సర్వర్ సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్యుమరేటర్ తన పరిధిలో రోజుకు 14 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉండగా 8 నుండి 9 కుటుంబాలను మాత్రమే సర్వే చేయగలుగుతున్నట్టు చెప్పారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాసాధికార సర్వే పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ సర్వే పురోగతితో పాటు ఎదురవుతున్న సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాసాధికార సర్వే ద్వారా గురువారం ఉదయానికి 48 వేల 885 కుటుంబాలకు చెందిన లక్షా 31 వేల 128 మందికి ఆన్‌లైన్ సర్వే పూర్తయ్యిందన్నారు. సర్వర్‌కు వినియోగిస్తున్న టాబ్‌లకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యల కారణంగా ఎప్పటికపుడు సరిచేసుకునేందుకు డివిజన్ స్థాయిలో సర్వీసింగ్ సెంటర్‌లను ఏర్పాటుచేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్‌కు ప్రతి వ్యక్తి సర్వేకు 4 రూపాయలు, సహాయకుడికి 3 రూపాయల వంతున చెల్లించాలన్నారు. సర్వే కారణంగా తమ పింఛన్లు, రేషన్ కార్డులు పోతాయన్న భయం ప్రజలకు ఎంతమాత్రం వద్దన్నారు. అపోహలు నమ్మవద్దని ముఖ్యమంత్రి సూచించారు. అర్హులెవరికీ ఏ విధమైన పథకాలను దూరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలకు మరింత సమగ్రమైన, సత్వరమైన సేవలందించేందుకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రజలకు తగిన అవగాహన కలిగించాలని కలెక్టర్ తదితర అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.