తూర్పుగోదావరి

లీకేజీ ప్రాంతాల్లో ఒఎన్జీసీ బృందం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, జూలై 24: గొల్లపాలెం జిజిఎస్ నుండి 20 రోజుల క్రితం క్రూడ్ ఆయిల్ మడ్ లీకేజి అయ్యి పరిసరాల్లోని పంట పొలాలు, సర్వే తోటలోకి వ్యాపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఒఎన్జీసీ అధికారుల బృందం ఈ లీకేజీపై సమగ్ర విచారణ జరిపేందుకు ఆదివారం జిజిఎస్ పరిసర ప్రాంతాల్లోని సర్వే తోటలను, పల్లపు ప్రాంతాలలో పర్యటించి విచారణ నిర్వహించారు.
నదీ గర్భం నుండి పైపులైను
దిండి, చించినాడ గ్రామాల మధ్య వశిష్ట గోదావరి నదిపై నిర్మించిన వంతెనను అనుకుని వుండే గ్యాస్ పైపులైను నదీ గర్భంలో నుండి ఏర్పాటుచేసేందుకు గెయిల్ సంస్థ పనులు చేపట్టింది. తాటిపాక జిజిఎస్ నుండి పశ్చిమగోదావరి జిల్లా వైపు గ్యాస్ సరఫరాకై ఈ పైపులైను వంతెన సైడ్ వాల్స్‌పై గతంలో ఉండేది. భద్రతా కారణాల దృష్ట్యా నదీ అంతర్భాగం నుండి ఈ పైపులైనును గెయిల్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.