తూర్పుగోదావరి

జ్వరాల కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 24: మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా జిల్లా ప్రజానీకాన్ని విషజ్వరాలు నిలువునా వణికిస్తున్నాయి. వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య గత రెండు రోజులుగా గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని ఏజన్సీ గ్రామాలలో విషజ్వరాలు విజృంభించిన విషయం తెలిసిందే. గిరిజన ప్రాంతాల్లో ప్రజలను విషజ్వరాలు పీడిస్తుండటంతో వైద్యఆరోగ్య శాఖ అప్రమమైంది. మారుమూల, ఏజన్సీ గ్రామాలకు వైద్య బృందాలను పంపింది. తాజాగా మెట్ట, మైదాన ప్రాంతాలకూ ఈ సమస్య వ్యాపించింది. లోతట్టు, మురికివాడల్లో విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా ఉంది. జిల్లా కేంద్రం కాకినాడ సహా పలు పురపాలక సంఘాల్లో జ్వర పీడితుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోగులు ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఏ ఒక్క మెడికల్ షాపు వద్ద చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. వాతావరణ కాలుష్యం కూడా విషజ్వరాలకు ప్రథాన కారణమని స్పష్టమవుతోంది. పారిశుద్ధ్య సమస్యలు, బహిరంగ మల విసర్జన, మురికికాలువల్లో పూడికతీత పనులు సక్రమంగా నిర్వహించకపోవడం, గృహ సముదాయాల వద్ద చెత్తకుప్పలుగా పేరుకుపోవడం తదితర కారణాలతో విష జ్వరాలు విజృంభిస్తున్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ సమస్య ప్రజల పాలిట శిరోభారంగా మారింది.
కాగా కాకినాడలో దోమల తీవ్రత ఇటీవలి కాలంలో అధికమైంది. రాత్రి వేళల్లో దోమకాటు సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. చిన్నపిల్లలు దోమల స్వైర విహారంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. దోమల నివారణకు నగర పాలక సంస్థ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాల్లేవని పలువురు వాపోతున్నారు. దోమల దాటికి పార్కుల్లో కూడా పట్టుమని పది నిముషాలు సేద తీరే అవకాశం లేకపోయిందని సీనియర్ సిటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని మురికివాడల్లో దోమల బెడద మరింత తీవ్రమైందని ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.