తూర్పుగోదావరి

పట్టుబడిన గంజాయి విలువ కోటిన్నర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 25: విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు తదితర ప్రాంతాల నుంచి అనపర్తి మీదుగా హైదరాబాద్‌కు గుట్టుగా తరలిస్తున్న గంజాయి అక్రమ రవాణా వ్యవహారాన్ని రాజమహేంద్రవరం అర్బన్ పోలీసులు ఛేదించారు. ఆదివారం తెల్లవారుజామున కడియం మండలం జేగురుపాడువద్ద పోలీసులు స్వాధీనంచేసుకున్న 3 టన్నుల 972 కిలోల గంజాయి విలువ రూ. కోటిన్నరగా తేల్చారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్పీ బి రాజకుమారి గంజాయి అక్రమ రవాణా వ్యవహారాన్ని వివరించారు. ఈ కేసులో అనపర్తికి చెందిన గొలుగూరి సత్యనారాయణరెడ్డి అలియాస్ అబ్బు, గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం రామిరెడ్డిపేటకు చెందిన పామలపాటి శ్రీనివాస్, నర్సారావుపేటకు చెందిన షేక్ సుబానీ, రాజమహేంద్రవరంనకు చెందిన చోడవరపు రాజేష్‌కుమార్, అన్యం శ్రీను, కొంతమూరుకు చెందిన కండెల్లి నానిబాబు అలియాస్ నాని అనే వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించే విశాఖ జిల్లా కొయ్యూరుకు చెందిన చిట్టిబాబు, హైదరాబాద్‌కు చెందిన చౌహాన్ పరారయ్యారని చెప్పారు. ఈ ముఠా నుంచి కోటిన్నర విలువైన 3.792 టన్నుల గంజాయి, రూ.12,760 నగదు, 8 సెల్‌ఫోన్లు, రెండు ఐషర్‌వ్యాన్లు, ఒక లారీ, శాంత్రో కారు, ఇండిగో కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం సొత్తు విలువ కోటి 75 లక్షల 12 వేలకు పైగా ఉంటుందని ఎస్పీ చెప్పారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి అనపర్తికి తరలించి, అక్కడి నుంచి రాష్ట్రంలోని, మహారాష్టల్రోని పూణే దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయిని లారీలు, వ్యాన్‌ల ద్వారా తరలిస్తున్నారన్నారు. అనపర్తిలోని రైసుమిల్లు కేంద్రంగా చేసుకున్నారని వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా లోపల గంజాయి బస్తాలు, పైన తవుడు బస్తాలు, పుచ్చకాయలు లోడు చేసుకుని గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు. 2 కేజీల చొప్పున గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి 158 బ్యాగ్‌లలో తరలిస్తున్నారన్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఆదివారం కడియం మండలం జేగురుపాడు వద్ద నిఘా వేసి రెండు వ్యాన్లు, లారీలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వెనుక కారులో వస్తున్న హైదరాబాద్‌కు చెందిన చౌహాన్ పరారయ్యాడన్నారు. ఏజెన్సీ నుంచి అనపర్తికి గంజాయిని రవాణా చేస్తున్న చిట్టిబాబు కూడా పరారీలో ఉన్నాడని వివరించారు. వీరిని విచారిస్తే తప్ప గంజాయి ఎక్కడెక్కడికి అక్రమంగా రవాణా అవుతోందన్న విషయాన్ని చెప్పలేమన్నారు. హైదరాబాద్ నుంచి చౌహాన్ గంజాయిని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. అనపర్తికి చెందిన గొలుగూరి సత్యనారాయణరెడ్డి 2008లో కూడా గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు అయ్యాడని, అతనికి 14ఏళ్ల జైలు శిక్ష కూడా పడిందని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న అతను మళ్లీ గంజాయి అక్రమరవాణాకు తెరతీశాడన్నారు. సత్యనారాయణరెడ్డిపై రౌడీషీటును తెరుస్తామని ఆమె చెప్పారు. అలాగే పామలపాటి శ్రీనివాస్ గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడని, అతనికి కేజీకి రూ. 200 చొప్పున కమిషన్ లభిస్తుందన్నారు. ప్రధాన నిందితుడు సత్యనారాయణ కేజీ గంజాయిని రూ. 8వేల చొప్పున విక్రయిస్తున్నాడని తెలిపారు. అర్బన్‌జిల్లాలో అక్రమ గంజాయి రవాణాను నిరోధించేందుకు ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. విలేఖర్ల సమావేశంలో అడిషినల్ ఎస్పీ ఆఠ్ గంగాధర్, దక్షిణమండలం డిఎస్పీ పి నారాయణరావు పాల్గొన్నారు. భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకునేందుకు కృషిచేసిన తమ సిబ్బందికి రివార్డులు అందజేస్తామని ఎస్పీ ప్రకటించారు.