తూర్పుగోదావరి

గంజాయ కేసులో ప్రధాన నిందితుడు హఠాన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 28: విశాఖ ఏజెన్సీ నుంచి అనపర్తి మీదుగా హైదరాబాద్‌కు కోటిన్నర విలువైన గంజాయిని రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన కేసులో నిందితునిగా ఉన్న గొలుగూరి వెంకట సత్యనారాయణరెడ్డి(62) గురువారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందాడు. పోలీసులు, జైలు వర్గాల కథనం ప్రకారం ఈ నెల 25న సత్యనారాయణరెడ్డిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బుధవారం మధ్యాహ్నం సత్యనారాయణరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. సత్యనారాయణరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు భావిస్తున్నారు. అయితే సత్యనారాయణరెడ్డి శరీరంపై గాయాలు ఉండటం గమనార్హం. సత్యనారాయణరెడ్డి మృతదేహానికి ఇన్‌చార్జి ఆర్డీవో శ్రీరామచంద్రమూర్తి, తహశీల్దార్ కె పోశయ్య సమక్షంలో పంచనామా నిర్వహించారు. శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. కాగా, 2008లో గంజాయి రవాణా కేసులో సత్యనారాయణ పట్టుబడ్డాడు. న్యాయస్థానం 14ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందాడు. ఈనెల 25న మళ్లీ గంజాయ కేసులో సత్యనారాయణరెడ్డి అరెస్టు కావడం గమనార్హం.