తూర్పుగోదావరి

యాత్రికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 29: గోదావరి అంత్య పుష్కర యాత్రికుల పట్ల మర్యాదగా వ్యవహరించి, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఎస్పీ బి రాజకుమారి పోలీసు సిబ్బందికి సూచించారు. పుష్కరస్నానం, పిండప్రదానాలు చేసే యాత్రికులు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరే వరకు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న గోదావరి అంత్య పుష్కరాలను పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన సుమారు 2500 మంది పోలీసు సిబ్బంది, అధికారులు శుక్రవారం సాయంత్రం విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. స్థానిక ఎంఆర్ మైదానంలో వారికి విధులను కేటాయించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు అంత్య పుష్కరాలు సన్నాహకం లాంటివని, ఈఅనుభవంతో కృష్ణా పుష్కరాల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అర్బన్ పరిధిలో కోటిలింగాలరేవు, పుష్కరాలరేవు, మార్కండేయస్వామిఘాట్, శ్రద్ధానందఘాట్, సరస్వతీఘాట్, గౌతమీఘాట్‌లను ప్రధాన ఘాట్లుగా గుర్తించామని, ఒక్కో ఘాట్‌కు ఒక్కో డిఎస్పీ, సిఐని ఇన్‌చార్జిగా నియమించామన్నారు. 2500 మంది పోలీసు సిబ్బందితో పాటు, 200 మంది ఎన్‌సిసి, 300 ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు అంత్య పుష్కరాల్లో సేవలందిస్తారన్నారు. పోలీసు అతిధిగృహం వద్ద ప్రధాన కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒరిస్సా, పశ్చిమబెంగాల్ నుంచి యాత్రికులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఈమేరకు ఆరాష్ట్రాల నుంచి సమాచార సేకరణకు ప్రయత్నిస్తామన్నారు. అంత్య పుష్కరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఎ, బి ప్రణాళికలు సిద్ధం చేశామని, రద్దీగా ఉన్న రోజుల్లో బి ప్లాన్‌ను అమలు చేస్తామన్నారు. బి ప్లాన్ అమల్లో ఉన్న సమయంలో వాహనాలను ఘాట్‌ల వరకు అనుమతించబోమన్నారు. నగరంలో 10 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించామన్నారు. జాతీయరహదారి మీదుగా వచ్చే వాహనాలను నగరంలోకి అనుమతించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. టింబర్‌యార్డు, గోదావరి రైల్వేస్టేషన్, సంస్కృత కళాశాలల్లో మోటార్‌సైకిల్ పార్కింగ్‌కు అనుమతిస్తామన్నారు. రద్దీగా ఉన్న సమయాల్లో స్నానఘట్టాల పరిసర ప్రాంతాల్లో నివసించే వారు ఇబ్బందులు పడకుండా గుర్తింపుకార్డులు చూపిస్తే వారిని స్థానికంగా తిరిగేందుకు అనుమతిస్తామన్నారు. అంత్య పుష్కరాల్లో నేరాల నిరోధానికి అనుమానితులు, యాచకులు, నిరాశ్రయులను గుర్తించి తరలించేందుకు ఇప్పటికే స్పెషల్‌డ్రైవ్ నిర్వహించామని ఎస్పీ వివరించారు. పాతనేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. వారిపై నిఘా కొనసాగిస్తామన్నారు. అంత్య పుష్కరాల్లో పోలీసు సిబ్బంది 3 షిఫ్టుల్లో పనిచేస్తారన్నారు. విధుల్లో ఉన్న సమయంలో సెల్‌ఫోన్లు వినియోగించరాదని సూచించారు. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను విధిగా వాటికే వినియోగించాలన్నారు. సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఘాట్లు రద్దీగా ఉన్న సమయాల్లో యాత్రికులను ఇతర ఘాట్లకు తరలించేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. తప్పిపోయిన వ్యక్తులను వెంటనే సమీపంలోని ఔట్‌పోస్టుకు చేర్చాలన్నారు. అనుమానాస్పద వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే అధికారులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో డిఎస్పీలు అంబికాప్రసాద్, జి శ్రీనివాస్, పలువురు డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు. ఈసందర్భంగా పోలీసు సిబ్బందికి విధుల పుస్తకాన్ని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రణాళికను అందజేశారు.