తూర్పుగోదావరి

వెలిగిపోనున్న పుష్కరఘాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 29: ఆది పుష్కరాల కంటే వైభవంగా అంత్య పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్‌ను దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నారు. అంత్య పుష్కరాల ప్రధాన వేదికగా పుష్కర ఘాట్ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అఖండ గోదావరి నదికి అఖండ హారతి కార్యక్రమానికి, అంత్య పుష్కరాల సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధాన భూమిక వహించే విధంగా పుష్కర ఘాట్‌ను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటు రైల్వే అండర్ టనె్నల్ బ్రిడ్జి నుంచి అటు వాటర్ వర్స్క్ కార్యాలయం ప్రాంతం వరకు రంగుల మయంగా మారింది. గోడలపై పురాణ ఐతిహాసిక చిత్రాలను రూపొందిస్తున్నారు. రంగు రంగుల విద్యుద్దీపాలంకరణ చేశారు. పుష్కర ఘాట్ మధ్య రెండు గేట్లను అవుట్ గేట్లుగా మార్చారు. పుష్కర ఘాట్‌కు ఇటు ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఒక ఇన్‌గేటు, అటు వాటర్ వర్క్స్ గోడ వైపు మరో ఇన్‌గేట్ ఏర్పాటు చేసి బారికేడింగ్ చేశారు. పుష్కర ఘాట్ జంక్షన్ ప్రాంగణంలోనే రాజరాజనరేంద్రుడి విగ్రహం వద్ద వేదిక నిర్మించారు. ప్రధాన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే విధంగా సందర్శకులకు అత్యధికంగా ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్ బయట శివుడి విగ్రహం షవర్ బాత్ కాకుండా ఈసారి కొత్తగా పుష్కర ఘాట్‌లో అంత్య పుష్కరాల ప్రత్యేకంగా జల్లు స్నానం ఏర్పాటు కూడా చేశారు. అదేవిధంగా కోటిలింగాల ఘాట్‌లో కూడా జల్లు స్నానం ఏర్పాటు చేశారు. ఒడిస్సా యాత్రికులందరినీ కోటిలింగాల ఘాట్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిస్సా యాత్రికులు ప్రధానంగా టూరిస్టు బస్సుల్లో వస్తుంటారు. ఇటు టూరిస్టు బస్సుల్లోనూ, అటు రైళ్లల్లోనూ వచ్చే యాత్రికులందరినీ కోటిలింగాల ఘాట్‌కు తరలించి ప్రధాన రద్దీ అంతా కోటిలింగాల ఘాట్‌లోనే నిర్వహిస్తూ మిగిలిన ఘాట్‌లలో రద్దీ లేకుండా క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం పూట అన్ని ఘాట్లలో స్నానాల రద్దీ ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి రద్దీ పల్చబడుతుందని, అనంతరం సాయంత్రం రద్దీ అంతా పుష్కర ఘాట్‌లోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంత్య పుష్కర పనె్నండు రోజులూ ఉదయం, సాయంత్రం పూట రెండు పూటలూ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పుష్కర ఘాట్‌లో ప్రధానంగా అఖండ హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో సందర్శకుల రద్దీ సాయంత్రం వేళ అత్యధికంగా వుంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పుష్కరఘాట్ ఈసారి ప్రధాన వేదిక కానుంది. అఖండ గోదావరి నదిలో ఇటు సీతానగరం మండలం మునికూడలి, ధవళేశ్వరంలోని రామపాదాలరేవు, రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్, పద్మావతి ఘాట్, మార్కండేయ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, టిటిడి ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమ ఘాట్‌లతో పాటు అఖండ గోదావరి నది దిగువ ప్రాంతంలో కోటిపల్లి, వాడపల్లి, తొగరపాయ, రాజోలు, అప్పనపల్లి స్నాన ఘట్టాలను మాత్రమే అనుమతిచ్చినప్పటికీ ఇందులో కొన్ని ఘాట్‌లలో మాత్రమే స్నానాలకు అనుకూలంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఘాట్‌లు స్నానాలకు అనువుగా లేవని తెలుస్తోంది. ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు. ఉదాహరణకు రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది ఘాట్లలో మొత్తం ఎనిమిది ఘాట్లను అనుమతిచ్చినప్పటికీ పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ మినహా మిలిగిన ఘాట్‌లు స్నానాలకు అనువుగా లేవు. గౌతమీ, సరస్వతి, శ్రద్ధానంద, టిటిడి, పద్మావతి, మార్కండేయ ఘాట్లలో ఇంకా రక్షణ మెస్‌లు నిర్మించలేదు. దీంతో లోతు అధికంగా ఉండటంతో స్నానాలకు శ్రేయస్కరంగా లేవు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్‌లలో మాత్రమే పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఉన్నాయి. దుస్తులు మార్చుకునే టెంపరరీ గదులతో పాటు, ఘాట్ల శుభ్రత తదితర వౌలిక సదుపాయల నేపధ్యంలో ఈ ఘాట్లకు అధికారులు అంతగా ప్రాధాన్యత కల్పించలేదన్నట్టుగా ఉంది. పిండ ప్రదాన క్రతువులు నిర్వహించుకునేందుకు కూడా ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు. ఏదేమైనప్పటికీ విద్యుద్దీపాలంకరణతో పాటు, నగరమంతా పరిశుభ్రంగా, అంత్య పుష్కర తేజోవంతంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లయితే చేపట్టారు గానీ ముహూర్తంలోగా ఈ పనులన్నీ పూర్తయినపుడే ఆయా పనులకు ప్రయోజనం ఉంటుంది. పోలీసు యంత్రాంగం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో పుష్కర విధులకు సన్నద్ధమైంది. 31వ తేదీ తెల్లారి ఐదు గంటలకు జోన్లవారీగా పుష్కర విధుల్లో అధికార యంత్రాంగం సన్నద్ధం కావాల్సి వుంది.