తూర్పుగోదావరి

ఉద్రిక్తత నడుమ ఇసుక రీచ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి గన్నవరం, మార్చి 25: ఉద్రిక్త పరిస్థితుల నడుమ పి గన్నవరం మండలం డిఎస్ పాలెం ఉచిత ఇసుక ర్యాంపును శుక్రవారం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ ర్యాంపు మంజూరులో ఆదినుండీ అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇసుక లోడు ట్రాక్టర్లు నిబంధనల మేరకు ఏటిగట్టు రోడ్డుగుండా వెళ్లేందుకు అనుమతులు లేవు. అందువల్ల ప్రత్యామ్నాయంగా ర్యాంపు నుండి ఏటిగట్టు పక్కగా రహదారి ఏర్పాటుచేసి ఇసుక తరలించే విధంగా అధికారులు రంగం సిద్ధంచేశారు. అందులో భాగంగా శుక్రవారం రహదారి ఏర్పాటు చేస్తున్న క్రమంలో కడలి సత్యవతి తన భూమిలో నుండి రహదారి వేసేందుకు వీల్లేదని కిరోసిన్ డబ్బాను వెంట తెచ్చుకుని ట్రాక్టర్‌ను అడ్డగించింది. ఇంతలో గందరగోళం తలెత్తగా ఎమ్మెల్యే కలగజేసుకుని ఈ ప్రాంత ప్రజలు ఇసుక దొరకక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, తానెంతో శ్రమించి పలుమార్లు కలెక్టర్‌తో సంప్రదించి, చర్చించి ర్యాంపును మంజూరు చేయించానన్నారు. మీరంతా అర్ధం చేసుకుని సహకరించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ర్యాంపునకు అడ్డుచెప్పవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తిచేశారు. అయినా ఫలితం లేకపోయింది. పోలీసులు రంగ ప్రవేశంచేసి ఆందోళన చేస్తున్న మహిళలకు నచ్చజెప్పేందుకు యత్నించారు. వారిపై ఎదురుతిరిగారు. దీంతో చేసేదిలేక ట్రాక్టర్‌ను అడ్డగించిన కడలి సత్యవతి, కడలి రామ తులసిపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదుచేశారు. మహిళా కానిస్టేబుల్ సహాయంతో కడలి సత్యవతిని వైద్య పరీక్షల నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో వివాదం సద్దుమణిగింది.
ఇసుక కొరత తీర్చడానికే ర్యాంపు : ఎమ్మెల్యే పులపర్తి
నియోజకవర్గం ప్రజలు ఇసుక అందుబాటులో లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఎలాగైనా ర్యాంపును తీసుకురావాలన్న తపనతో పలుమార్లు కలెక్టర్, మైనింగ్ అధికారులతో సంప్రదింపులు జరిపి ర్యాంపు మంజూరు చేయించానని ఎమ్మెల్యే పులపర్తి పేర్కొన్నారు. ర్యాంపు ప్రారంభించిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కొంతమంది స్వార్థపరులు రాజకీయ దురుద్దేశంతో అమాయకులను రెచ్చగొట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే తపనతో పనిచేస్తున్న తనకు చెడ్డపేరు తీసుకురావడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఏటిగట్టు ల్యాండ్ అక్విజేషన్ చేసిన భూమి గుండా రహదారి నిర్మిస్తున్నామని, దీని వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రజలు ఇసుక తవ్వకాలు చేసుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పులపర్తి హెచ్చరించారు.